తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ ల స్థాన చలనం చర్చనీయాంశమైంది. ఒకేసారి 91 మందిని బదిలీ చేయడంపై రాష్ట్రంలో తీవ్ర చర్చ సాగుతోంది. ఈ నెల 3వ తేదీన 29 మంది ఐపీఎస్ లను ప్రభుత్వం బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఒకే సారి 91 మంది పైన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఇలా మార్పులు జరగడం పోలీస్ శాఖను ప్రక్షాళన చేయడం వెనుక కారణం ఏమిటై ఉంటుందని అందరూ ఆరాతీస్తున్నారు. ఈ ఏడాది ఎన్నికలు ఉన్నందునే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారా..? అని అనుకుంటున్నారు. మరికొందరు ముందస్తు ఎన్నికలు కూడా ఉండే అవకాశాలున్నాయని అంటున్నారు. కొత్తగా డీజీపీగా బాధ్యతలు చేపట్టగానే అంజనీ కుమార్ తన మార్క్ ఉండేలా ఈ బదిలీలు చేశారని అంటున్నారు.. తాజాగా ఒకే ఉత్తర్వుతో 91 మంది ఐపీఎస్ లు స్థానం చలనం కావడం సంచలనమైంది.
అసెంబ్లీ ఎన్నికలకు మరి కొద్ది నెలలే సమయం ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎంతోకాలంగా పెండింగులో ఉన్న టీచర్ల బదిలీలు, ప్రమోషన్లకు పచ్చ జెండా ఊపారు.
అలాగే వారికి హెల్త్ కార్డులు కూడా జారీ చేయడానికి సన్నద్దం చేస్తున్నారు. త్వరలో ప్రవేశపెట్టే బడ్జెట్ లో సంక్షేమ పథకాలకు భారీగా బడ్జెట్ కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది. తాజాగా భారీగా ఐపీఎస్ లు మారడంతో ఇక ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. 2018 డిసెంబర్ లో ఏర్పడిన ప్రభత్వం నిర్ణీత సమయానికి కాకుండా మరింత ముందుకు వెళ్లొచ్చని అంటున్నారు.
ఇప్పటికే తెలంగాణకు కొత్త సీఎస్ రావడంతో పాటు కొత్త డీజీపీ కూడా నియమితులయ్యారు. ఇదే తరుణంలో డిపార్ట్ మెంట్లలో ప్రక్షాళన చేసే దిశగా భారీగా అధికారులను మారుస్తున్నట్లు తెలుస్తోంది.
ఒకే చోట ఎక్కవ రోజుల పనిచేసిన వారిని బదిలీలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఐఏఎస్ అధికారుల బదిలీలు కూడా ఉంటాయా..? అనే చర్చ సాగుతోంది. కానీ ఆ ప్రస్తావన రావడం లేదు. బడ్జెట్ తరువాత మార్పులు ఉండే చాన్స్ ఉందని అంటున్నారు.
ఇక ఈ బదిలీలు ఎన్నికల స్టంట్ గానే అందరు అనుకుంటున్నారు. ఈ ఏడాది చివర్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నందున ప్రభుత్వం ఇప్పటి నుంచే అప్రమత్తమవుతోంది. ఇప్పుడు ట్రాన్స్ ఫర్ అయినవారిని కనీసం 3 ఏళ్లు పోస్టింగ్ లో ఉండాలనే నిబంధన ఉంది. అందుకే కీలక స్థానాల్లో కేసీఆర్ సర్కార్ తమకు అనుకూలురను పెట్టుకుందనే ప్రచారం సాగుతోంది. ఇవే కాదు.. ప్రజలను ఆకర్షించుకునేందుకు పథకాలు భారీగా ప్లాన్ చేస్తున్నారని.. అందరికి చేరేలా ప్లాన్ వేస్తున్నట్టు తెలిసింది.. ఇన్నాళ్లు ఎలా ఉన్నా.. ఇప్పుడు ప్రభుత్వంపై వారికి నమ్మకం కలిగితేనే వచ్చే ఎన్నికల్లో ఆదరించే అవకాశం ఉందని కేసీఆర్ ఇలా అన్నీ పకడ్బందీగా చేస్తున్నట్టు చర్చ సాగుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.