విస్తరణ.. కేసీఆర్ మనుసులో ఏముంది?

Update: 2019-07-30 04:51 GMT
తెలంగాణ సీఎం కేసీఆర్ తన కేబినెట్ ను విస్తరించబోతున్నారు. కొద్ది రోజులుగా ఈ వార్త హల్ చల్ చేస్తోంది. కేబినెట్ లోకి నలుగురిని తీసుకోబోతున్నారని చర్చ విస్తృతంగా సాగుతోంది.  తెలంగాణ రాజకీయ వర్గాలు, ఎమ్మెల్యేలు ఆతృతగా ఎదురుచూస్తున్న ఈ కేబినెట్ విస్తరణపై తాజాగా టీఆర్ ఎస్ ముఖ్యులు ఖరాకండీగా చెప్పేశారట.. అసలు కేసీఆర్ ఫోకస్ కేబినెట్ మీదే లేదని తేల్చిచెప్పారట..

కేసీఆర్ ప్రస్తుతం ఒకటే టార్గెట్ గా ముందుకు వెళ్తున్నట్టు టీఆర్ ఎస్ ముఖ్యులు చెబుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నీటి ఎత్తిపోతలు- జూరాల నుంచి నీటిని వివిధ ప్రాజెక్టులకు నీటిని ఎత్తిపోయడం.., పెంచిన పింఛన్ల అమలు- సంక్షేమ పథకాలు.. రాబోయే కీలక బడ్జెట్ పైనే ఫుల్ ఫోకస్ పెట్టాడట.. ఇక రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి చాన్స్ ఇవ్వకుండా తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ ఎస్ ను గెలిపించేలా పక్కాగా స్కెచ్ గీస్తున్నారట..

ఇక ముహూర్తాలను బాగా నమ్మే కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లోనూ రాబోయే మూడు నెలలు మూఢాలు కావడంతో మంత్రివర్గ విస్తరణకు పూనుకోరని టీఆర్ఎస్ ముఖ్యులు చెబుతున్నారు.

ఈ లెక్కన కొత్త కేబినెట్ పై హల్ చల్ చేస్తున్న వార్తలు పూర్తి అవాస్తవాలను సమాచారం. కేసీఆర్ ముందున్న ఈ సవాలన్నీ పూర్తి అయ్యాకే కొత్త కేబినెట్ విస్తరణకు అడుగులు వేయబోతున్నారట.. కొత్తగా కేబినెట్ లోకి ఆరుగురిని తీసుకునే చాన్స్ ఉంది. కేటీఆర్- హరీష్ పోను ఒక మహిళా మరో ముగ్గురికి చాన్స్ దక్కనుంది. వారు ఎవరనేది తేలాలంటే దసరా తర్వాత వరకు ఆగాల్సిందేనని పార్టీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది..

    

Tags:    

Similar News