ఇది ఒక అనూహ్యమైన విషయం. ఇప్పటి వరకు కేవలం మేధావుల మధ్య మాత్రమే చర్చకు వచ్చిన విషయం. కానీ..ఇప్పుడు ఇది సామాన్యుల వరకు చేరిపోయింది. వచ్చే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. కొన్ని పార్టీలు చేస్తున్న ప్రచారంలో భాగంగా.. కేంద్రంలోని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అర్హతలపై.. ఇప్పుడు సామాన్యుల మధ్య తీవ్రస్థాయిలో చర్చజరుగుతోంది. చిన్నపాటి ఉద్యోగం చేసేందుకు.. కనీసం 10వ తరగతి అర్హత కోరుతున్న పరిస్థితిలో దేశాన్నేలే ప్రధాని అర్హతపై చర్చ మొదలైంది.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు వచ్చాయి. ఈ క్రమంలో ఆజాదీకా అమృత్ మహోత్సవ్ పేరిట.. దేశవ్యాప్తంగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా ప్రధాని మోడీ కార్యక్రమాలు నిర్వహించారు.. ఇంకా నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలో ఆయన అనేక విషయాలు చెబుతున్నారు. తమ హయాంలో దేశం వెలిగి పోతోందని.. మరోసారి.. గత బీజేపీ వాదనను ఆయన తెరమీదకి తెచ్చారు. అయితే.. అదేసమయంలో ధరలు కూడా మండిపోతున్నాయని.. ముఖ్యంగా ద్రవ్యోల్బణం.. తారాస్థాయికి చేరిందని.. ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ క్రమంలో ఇవన్నీ అర్ధం కావాలంటే.. ప్రధానికి ఉన్నత చదువు అవసరమని.. ఇటీవల ప్రతిపక్షాలకు చెందిన కొందరు నాయకులు వ్యాఖ్యానించారు. మోడీ టీ వ్యాపారం నుంచి వచ్చి ప్రధాని అయ్యారని.. ఆయనకు పెద్దగా చదవులేదని.. అందుకే..ఆయన ద్రవ్యోల్బణం.. ధరల పెరుగుదల వాటిని ఎలా కట్టడిచేయాలి..అనే కీలక అంశాలు తెలియని.. కొందరు ప్రతిపక్ష నాయకులు విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో..అసలు ప్రధాని నరేంద్రమోడీ ఏం చదువుకున్నారనే చర్చ జోరుగా సాగుతోంది.
దీనికి సంబంధించి పూర్వప్రధానుల నుంచి ఇప్పటి వరకు ఎవరెవరు ఏమేం చదువుకున్నారు? వారి అర్హతలు ఏంటి? అనే విషయాలపై సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. తొలి ప్రధాని నెహ్రూ.. ఏకంగా.. ఎంఏ లా చేశారు. అది కూడా విదేశీ విశ్వవిద్యాలయం నుంచి.. మన తెలుగు వారైన.. పీవీ కూడా.. ప్రముఖ రచయిత. పైగా ఉన్నత విద్యను అభ్యశించారు.
ఇక, కూర్చున్న చోటల్లా నిద్ర పోతారంటూ.. నిద్రకు కేరాఫ్ అంటూ.. అప్పట్లో ప్రచారం చేసిన కర్ణాటక నేత.. మాజీ ప్రధాని దేవె గౌడ కూడా ఉన్న త విద్యచదివారు. కానీ.. మోడీ ఏం చదివారనే విషయాన్ని మాత్రం కేంద్రం వెల్లడించడం లేదు. పైగా.. దీనిని గోప్యత పద్దులోకి చేర్చేసింది. ఈ పరిణామంపై నెటిజన్లు ఆసక్తిగా స్పందిస్తున్నారు. ఇది పెరిగి పెద్దదయితే.. మోడీకి ఇబ్బందేనని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.