నిక్కచ్చిగా ఉండటం అన్న మాట తెలుగులో ఒకటి ఉంది. దాని అర్థం. ఉన్నది ఉన్నట్లుగా చెప్పటం. విషయం ఏదైనా నిక్కచ్చి అంటే.. త్రాసులోని ముల్లు మాదిరిగా స్టైయిట్ గా ఉండటం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫలానా వారు పత్తిత్తులు.. మిగిలిన వారంతా మరోలాంటి వారు అని చెప్పలేం. అలా అని.. ప్రతి మాటను తమకు తోచినట్లుగా చెప్పటం కూడా సరికాదు. రెండు.. మూడు రోజుల క్రితం జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనను ఉద్దేశించి.. ప్యాకేజీ స్టార్.. మూడు పెళ్లిళ్లు అంటూ అదే పనిగా ఏపీ అధికార వైసీపీ నేతలు తిట్టటాన్ని.. నిందలు వేయటాన్ని ఉద్దేశించి స్పందిస్తూ.. ఇకపై తనను ఉద్దేశించి ప్యాకేజీ స్టార్ అన్న మాట అంటే చెప్పుతో కొడతా అంటూ మండిపడటం తెలిసిందే.
ఆ సందర్భంగా ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు ఏమిటి? అన్నది ప్రశ్న. ఎందుకంటే.. తాజాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవనిగడ్డ సభలో మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ చేసిన మూడు పెళ్లిళ్ల వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ.. తనకు తోచిన రీతిలో అర్థం చేసుకొని.. మాట్లాడటం ఇప్పుడు షాకింగ్ గా మారింది. ఒక పార్టీ అధినేత మాట్లాడిన మాటల్ని.. ప్రస్తావించే వేళలో.. నిక్కచ్చిగా ఉండటం చాలా అవసరం. అందుకు భిన్నంగా నోటికి వచ్చినట్లుగా మాట్లాడకూడదు. ఎందుకంటే.. అత్యున్నత స్థానాల్లో ఉన్న అధినేత నోటి నుంచి వచ్చే ప్రతి మాటకు విలువ ఉంటుందన్నది మర్చిపోకూడదు.
ఇప్పుడున్న సందేహాల కాలంలో ప్రతిది అనుమానంగా.. సందేహంగా చూడాల్సిన దుస్థితి. ఇక్కడ పవన్ వాదన సరైనది అంటే.. పవన్ చెప్పులు మోస్తున్నారా? అంటూ దూషించటం.. జగన్ అద్భుతంగా చెప్పారంటే.. ఎంతకు అమ్ముడుబోయారంటూ విరుచుకుపడటం ఇప్పుడు మామూలైపోయింది. ఇలాంటి వేళ.. ఉన్నది ఉన్నట్లుగా.. జరిగింది జరిగినట్లుగా చెప్పటానికి మించిన కష్టం.. సమస్య మరొకటి ఉండదు.
అందుకే.. ఇలాంటి అనుమానాలు.. సందేహాలు తలెత్తకుండా.. సీఎం జగన్.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు వారి మాటల్నే యథాతధంగా తీసుకొని.. మరోసారి చదువుకుంటే ఎవరేం అన్నారు? దానికి ఎలా రియాక్టు అయ్యారన్న విషయంపై మరింత స్పష్టత వస్తుంది. ఒకరన్న మాటల్ని మరొకరు చెప్పేటప్పుడు కొంత మార్పు సహజం. అంతమాత్రాన మరీ అర్థం మొత్తం మారిపోయేలా మాట్లాడటం కూడా సరికాదు. అందుకే.. మొన్న సభలో పవన్ ఏమన్నారు? తాజా సభలో జగన్ ఏమన్నారు? అన్నది యథాతధంగా చదివేద్దాం.
పవన్ వ్యాఖ్యలు ఇవే..
- ''వైసీపీ గూండాల్లారా.. ఇప్పటివరకు పవన్ కల్యాణ్ మంచితనం.. సహనం చూశారు. అదే మిమ్మల్ని రక్షించింది. ఈ రోజు నుంచి గుర్తు పెట్టుకోండి మీరు యుద్దం ఎప్పుడో చెప్పండి. నేను దేనికైనా రెఢీ. ఎంతమంది వైసీపీ గూండా ఎమ్మెల్యేలు వస్తారో అంతా బయటకు రండి. ప్యాకేజీ స్టార్ అంటే చెప్పు తీసి దవడ వాచిపోయేలా కొడతాను. తమషాగా ఉందా? చావో రేవో రాజకీయాల్లోనే తేల్చుకుంటా''
- ''మాట్లాడితే మూడు పెళ్లిళ్లు అంటారు. మీరూ చేసుకోండి ఎవరు కాదన్నారు? మొదటి భార్యకు విడాకులు ఇచ్చి రూ.5 కోట్లు ఇచ్చాను. తర్వాత చేసుకున్న రెండో భార్యకు ఆస్తి ఇచ్చాను. ఆమెకు విడాకులు ఇచ్చాకే మూడో పెళ్లి చేసుకున్నాను. ఒక్కరిని పెళ్లి చేసుకొని 30 మంది స్టెఫ్నీలతో తిరిగే మీకేంటి నేను చెప్పేది?''
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి
- ''మూడు రాజధానుల వల్ల అందరికీ మేలు జరుగుతుందని మనం చెబుతుంటే, కాదు మూడు పెళ్లిళ్ల వల్లే మేలు జరుగుతుంది, మీరూ చేసుకోండి అని ఏకంగా టీవీల్లోనే చెబుతున్నారు కొందరు నాయకులు. ఈ విధంగా మాట్లాడే నాయకుల విషయంలో ఆలోచన చేయండి. అదే జరిగితే రేపు పొద్దున మన ఇంట్లో ఆడవాళ్ల పరిస్థితి ఏమిటి? మన కూతుళ్ల పరిస్థితి ఏమిటి? మన చెల్లెమ్మల పరిస్థితి ఏమిటి? రేపు పొద్దున ప్రతి ఒక్కరూ నాలుగేళ్లో.. ఐదేళ్లో కాపురం చేసి, ఆ తర్వాత ఎంతో కొంత ఇచ్చి విడాకులు ఇచ్చేసి మళ్లీ పెళ్లి చేసుకోవడం మొదలుపెడితే, ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు నాలుగు సార్లు అని మొదలుపెడితే వ్యవస్థ ఏం బతుకుతుంది? ఆడవాళ్ల మానప్రాణాలు ఏం కావాలి? అక్కచెల్లెమ్మల జీవితాలు ఏం కావాలి? ఇలాంటి వారా మనకు నాయకులు? ఆలోచించండి''
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.