రాహుల్ హెల్త్ సీక్రెట్ ఏమిటి? విద్యార్థి ప్రశ్నకు ఏమని చెప్పారంటే?

Update: 2021-03-02 06:30 GMT
గడచిన కొద్ది రోజులుగా సౌత్ లో ప్రయాణిస్తున్న కాంగ్రెస్ అగ్రనేతల్లో ఒకరైన రాహుల్ గాంధీ.. తొలిసారి తన మాటలతోనూ.. చేతలతోనూ అందరిని ఆకర్షిస్తున్నారు. ఇప్పటివరకు రాహుల్ లో బయటకు రాని ఎన్నోకోణాలు తాజా ట్రిప్ లో బయటకు వస్తున్నాయి. నడి సముద్రంలో స్మిమ్ చేయటమే కాదు.. తనలో ఉన్న టాలెంట్ ను బయట పెట్టటమే కాదు.. ఇప్పటివరకు ప్రదర్శించని కళల్ని ఆయన బయటపెడుతున్నారు.

తాజాగా తమిళనాడులో పర్యటిస్తున్న ఆయన.. కన్యాకుమారిలోని ములగుమూడులోని ఒక స్కూల్ విద్యార్థులతో మాట్లాడారు. అంతకు ముందు స్కూల్ కు రావటానికి ముందుకొందరు విద్యార్థులతో కలిసి టీ తాగిన సందర్భంగా వారితో పలు అంశాల్ని షేర్ చేసుకున్నారు.

ఈ సందర్భంగా రాహుల్ ఆరోగ్య రహస్యాన్ని ఒక విద్యార్థి ప్రశ్నించారు. దీనికి స్పందించిన రాహుల్.. తాను ప్రత్యేకమైన డైట్ ఏమీ తీసుకోనని.. రన్నింగ్ చేస్తానని చెప్పారు. స్విమ్మింగ్.. సైక్లింగ్ కూడా చేస్తానని చెప్పారు. తాను అకిడో మార్షల్ ఆర్ట్ కూడా నేర్చుకున్నట్లు చెప్పిన రాహుల్.. అందుకు సంబంధించిన ఒక టెక్నిక్ ను విద్యార్థికి చూపించి ఆశ్చర్యానికి గురి చేశారు.

తనలోని టాలెంట్ ను చూపించిన రాహుల్ విద్యార్థుల్ని ఫిదా చేశారు. అనంతరం స్కూల్లో విద్యార్థులకు మీరేం కావాలనుకుంటున్నారన్న ప్రశ్నకు ఒక విద్యార్థి వ్యోమగామి కావాలని చెప్పారు. దీనికి స్పందించిన రాహుల్.. సదరు విద్యార్థి ఇస్రో సందర్శించేందుకు వీలుగా అనుమతి ఇవ్వాలని కోరుతూ ఇస్రో ఛైర్మన్ కు లేఖ రాయనున్నట్లు చెప్పారు. ఇక.. జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న నీట్ పరీక్షను తమిళనాడు రాజకీయ పార్టీలు అడ్డుకున్నాయని.. ఈ పరీక్ష విద్యార్థులకు ఉపయోగపడేది కాదన్న వ్యాఖ్య చేయటం గమనార్హం. యాభై ఏళ్ల వయసులో పాతికేళ్ల కుర్రాడి మాదిరి ఉన్న రాహుల్ ఆరోగ్య రహస్యం మొత్తానికి రివీల్ అయ్యింది.
Tags:    

Similar News