స్లాట్ బుకింగ్ లో ఈ ‘ఎ..బి..సి..డీ’ కేటగిరి ఏంది?

Update: 2020-12-16 07:30 GMT
మూడు నెలలకు పైగా తెలంగాణ రాష్ట్రంలో ఆపేసిన వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ఈ సోమవారం నుంచి షురూ కావటం.. కొన్నింటిని మాత్రమే రిజిస్టర్ చేసుకోవటం తెలిసిందే. లక్షలాది రిజిస్ట్రేషన్లు పెండింగ్ లో ఉండగా.. తెలంగాణ రాష్ట్రంలోని 142 రిజిస్టర్ కార్యాలయాల్లో రోజుకు24 చొప్పున ఎన్ని రిజిస్ట్రేషన్లు చేయగలరో తెలిసిందే. గతంలో స్లాట్ బుకింగ్ అంటే.. కనీస వివరాలతో తీసుకొని కోరుకున్న సమయాన్ని ఇచ్చేవారు. ఈ సమయంలో రిజిస్ట్రేషన్ చేసేవారు. రోజుకు కొన్ని గంటలు మాత్రమే ఈ స్లాట్ విధానం అమలు చేసేవారు. ఆ తర్వాత విడిగానే (అంటే.. స్లాట్లతో సంబంధం లేకుండా) రిజిస్ట్రేషన్లు చేసేవారు.

కొత్తగా తీసుకొచ్చిన విధానం ప్రకారం.. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతి రిజిస్ట్రేషన్ కేవలం స్లాట్ బుకింగ్ లో మాత్రమే నమోదు చేసుకునే వీలుంది. విడిగా.. చేసే అవకాశమే లేదు. నిత్యం పరిమిత సంఖ్యలో రిజిస్ట్రేషన్లు చేస్తే.. పెండింగ్ లో ఉన్న లక్షలాది రిజిస్ట్రేషన్ల ఎప్పుడు పూర్తి అవుతాయి? అన్నది అసలు ప్రశ్న.

దీనికి సమాధానంగా కొత్త విధానాన్ని తెర మీదకు తీసుకొచ్చినట్లు చెబుతున్నారు. మంగళవారం రిజిస్ట్రేషన్లు ఏ రీతిలో చేయాలన్న అంశంపైనా.. కొత్త విధానంలో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన కమిటీ దాదాపు ఐదు గంటలు కసరత్తుచేశారు. ఈ సందర్భంగా కొత్త విధానాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రిజిస్ట్రేషన్ కార్యాలయాల్ని ఎ..బి..సి..డీ విభాగాలుగా విభజించనున్నారు. రద్దీ ఆధారంగా ఆయా కేటగిరిలో చేర్చనున్నారు.

ఉదాహరణకు ఏ కేటగిరి విషయానికి వస్తే.. రాష్ట్రం మొత్తమ్మీదా అత్యంత రద్దీగా రిజిస్ట్రర్ కార్యాలయాన్ని ఏ కేటగిరిలో ఉంచాలి. అదే సమయంలో బి కేటగిరిలో 10 నుంచి 15 రిజిస్టర్ కార్యాలయాలు.. సీ కేటగిరిలో 30 వరకు.. డీ కేటగిరిలో 60 - 70 మంది సబ్ రిజిస్ట్రార్ లు ఉండేలా ప్లా చేస్తున్నారు. డీ కేటగిరిలో ఉండే కార్యాలయాల్లోనెలకు ఒకటి రెండు మాత్రమే రిజిస్ట్రేషన్లు జరుగుతాయని చెబుతున్నారు. అదే సమయంలో ఏ కేటగిరిలో  ఉండే కార్యాయలాల్లో అత్యధికం హైదరాబాద్ శివారులోనివే కావటం గమనార్హం. ఇక.. రిజిస్ట్రేషన్లు చేయని కారణంగా ఏర్పడిన బ్యాక్ లాగ్ ను మార్చి లోపు పూర్తి చేస్తామన్న ధీమాలో కేసీఆర్ సర్కారు ఉన్నట్లుగా తెలుస్తోంది. వినేందుకు బాగున్నా.. ఆచరణలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో చూడాలి.
Tags:    

Similar News