మూడో వేవ్ ముంచుకొస్తున్న వేళ.. ఇప్పటికే రెండు డోసులు వేసుకున్న వారంతా బూస్టర్ డోస్ వేసుకోవాలంటూ కేంద్రం చెప్పటం తెలిసిందే. బూస్టర్ డోస్ గురించి కేంద్రం ప్రకటన చేసినప్పటికీ.. అందులో ఎలాంటి స్పష్టత లేదు. తొలుత.. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారు.. పెద్ద వయస్కులకు బూస్టర్ డోసులు వేస్తున్నట్లు చెప్పారే కానీ.. బూస్టర్ డోస్ కింద ఏం వేసుకోవాలి? అన్న అసలు ప్రశ్నకు సమాధానం చెప్పింది లేదు.
ఇలాంటివేళ.. హైదరాబాద్ కు చెందిన ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజీ వైద్యుడు కమ్ ఏషియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆసుపత్రుల ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వరరెడ్డి ఒక అధ్యయనం నిర్వహించారు. దీనికి సంబంధించి వివరాల్ని ఆయన తాజాగా వెల్లడించారు. ఇప్పటివరకు ప్రపంచంలోని పలు దేశాల్లోని నిపుణులు వెల్లడించినట్లే.. మొదటి రెండుసార్లు వేసుకున్న రకం టీకా కాకుండా బూస్టర్ డోసుగా వేరే టీకాను వేసుకోవటం ద్వారా యాంటీ బాడీలు నాలుగు రెట్లు అధికంగా పెరిగినట్లుగా తమ అధ్యయనం తేల్చినట్లుగా పేర్కొన్నారు.
ఏఐజీ.. ఏషియన్ హెల్త్ కేర్ సంయుక్తంగా నిర్వహించిన ప్రత్యేక అధ్యయనంలో ఈ అంశాన్ని గుర్తించినట్లు చెప్పారు. ఇప్పటివరకు మన దేశంలో మూడు రకాల వ్యాక్సిన్లను ఇవ్వటం తెలిసిందే. అందులో ఒకటి కొవిషీల్డ్ అయితే రెండో కొవాగ్జిన్.. మూడో స్పుత్నిక్. తాజాగా నాగేశ్వరరెడ్డి చెప్పిన దాని ప్రకారం చూస్తే.. కొవిషీల్డ్.. కొవాగ్జిన్ డోసుల మేళవింపుతో అధిక యాంటీబాడీలు వృద్ధి చెందాయని స్పష్టంచేశారు.
ఈ తరహా అధ్యయనం తాము దేశంలో మొదటిసారి చేశామన్నారు. బూస్టర్ డోసు టీకా విషయంలో తాము చేసిన అధ్యయనాన్ని సూచనగా పరిగణించాలని ఐసీఎంఆర్ ను కోరినట్లుగా డాక్టర్ నాగేశ్వరరెడ్డి పేర్కొన్నారు. దీనికి సంబంధించిన అధ్యయన వివరాల్ని తాము ఐసీఎంఆర్ పరిశీలనకు పంపినట్లు చెప్పారు. తమ అధ్యయనంలో భాగంగా 330 మంది ఆరోగ్యవంతులైన వాలంటీర్లను 60 రోజులపాటు పరిశీలించి.. ఈ అంశాల్ని గుర్తించినట్లు పేర్కొన్నారు. వారికి భిన్న రకాలుగా టీకాలు అందించి.. ఫలితాల్ని విశ్లేషించినట్లుగా చెప్పారు. తాము చేసిన అధ్యయనంలో ప్రతికూలతు లేకపోవటంతో టీకాల మేళవింపు సురక్షితమని తేల్చినట్లుగా చెప్పారు. మరి.. డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి టీం చెప్పినట్లుగా.. బూస్టర్ డోస్ విషయంలో ఐసీఎంఆర్ ఆయన అధ్యయనాన్ని పరిగణలోకి తీసుకుంటుందా? అన్నది చూడాలి.