ట్రంప్ సతీమణి మెలనియా ఆరోగ్య పరిస్థితి ఇప్పుడెలా ఉంది?

Update: 2020-10-04 04:30 GMT
ప్రపంచానికి అధినేత.. ఆగ్ర రాజ్యమైన అమెరికాకు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న డొనాల్డ్ ట్రంప్ కరోనా బారిన పడటం తెలిసిందే. కరోనా విషయంలో ఆయన అనుసరిస్తున్న వైఖరి.. మాస్కులు పెట్టుకోకుండా వ్యవహరిస్తున్న తీరును పలువురు తప్పు పట్టటం తెలిసిందే. ఈ మధ్య కాలంలో అప్పుడప్పుడు మాస్కులు ధరిస్తున్న ఆయనకు.. అందరూ అంచనా వేసినట్లే కరోనా పాజిటివ్ గా తేలింది.

ఇదిలా ఉంటే.. ట్రంప్ కు సన్నిహితంగా ఉండే వారిలో ముఖ్యులైన ఆయన సతీమణి మెలనియా ట్రంప్ తాజా ఆరోగ్య పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నగా మారింది. వైట్ హౌస్ అధికారిక వర్గాల సమాచారం ప్రకారం ట్రంప్ సతీమణికి సైతం కరోనా లక్షణాలు కొద్దిమేర కనిపిస్తున్నట్లుగా చెబుతున్నారు.

ప్రస్తుతానికి ఆమె స్వల్పమైన దగ్గు.. తలనొప్పితో ఇబ్బంది పడుతున్నట్లు చెబుతున్నారు. వయసులో ట్రంప్ తో పోలిస్తే చిన్నది కావటంతో రోగ నిరోధక శక్తితో ఆమె కరోనాను అధిగమించటం పెద్ద కష్టమైన విషయం కాదన్న మాట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. ట్రంప్ కు పాజిటివ్ అని తేలిన తర్వాత.. ఇద్దరు సెనేటర్లకు.. ట్రంప్ మాజీ సలహాదారుకు.. ఆయన ఎన్నికల ప్రచార మేనేజర్ కు.. వైట్ హౌస్ ను కవర్ చేసే ముగ్గురు జర్నలిస్టులకు తాజాగా కరోనా పాజిటివ్ అని తేలినట్లుగా తెలుస్తోంది.
Tags:    

Similar News