దేశంలో తోలి కేంద్ర బడ్జెట్ ఎంతంటే..ఏ ఆర్థిక మంత్రి ఎక్కువ బడ్జెట్లు ప్రవేశపెట్టారంటే ?
దేశంలో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలిబడ్జెట్ ను 1947లో ప్రవేశపెట్టారు. 1947-48 ఆర్థిక సంవత్సరానికి అప్పటి ఆర్థిక మంత్రి ఆర్‌కే షణ్ముగం శెట్టి 1947 నవంబర్ 26వ తేదీన పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఇది 1947 ఆగస్టు 15వ తేదీ నుంచి 1948 మార్చి 31 వరకు ఏడున్నర నెలలకు మాత్రమే బడ్జెట్ ఇది. ఆ బడ్జెట్ ప్రసంగంలో ఆయన ప్రధానంగా, ఆహార, పారిశ్రామిక ఉత్పత్తి, దిగుమతుల్ని తగ్గించి స్వయం సమృద్ధి సాధించటంపై ఎక్కువగా దృష్టి పెట్టారు. అలాగే, భవిష్యత్ అవసరాల దృష్ట్యా రక్షణ రంగాన్ని బలోపేతం చేయటం గురించి మాట్లాడారు. సమాజంలో శాంతి భద్రతలను నెలకొల్పాలని ఆయన పిలుపునిచ్చారు.
1947 పద్దుల్లో ఆదాయ వ్యయాలు : ఆదాయం అంచనా రూ.171.15 కోట్లు ,వ్యయం అంచనా రూ.197.39 కోట్లు, లోటు రూ.26.24 కోట్లు రూ.171.15 కోట్లలో కస్టమ్స్ నుంచి రూ.50.5 కోట్లు, ఆదాయపు పన్ను ద్వారా రూ.29.5 కోట్లు, సాధారణ వసూళ్లు రూ.88.5 కోట్లుగా చూపించారు. పోస్టు, టెలిగ్రాఫ్ ల శాఖల నుంచి ఆదాయం అప్పట్లో అత్యధికంగా ఉండేది. సుమారు రూ.15.9 కోట్లు.
దేశంలో ఎక్కువ బడ్జెట్లు ప్రవేశపెట్టిన వారిలో అగ్రస్థానంలో ఉన్నది మొరార్జీ దేశాయ్. ఆయన ఏకంగా 10 బడ్జెట్లు ప్రవేశపెట్టారు. 1959-63 మధ్య అలాగే... 1967-69 మధ్య బడ్జెట్లు ప్రవేశపెట్టారు. అలాగే 1962-63, 1967-68లో మధ్యంతర బడ్జెట్లను పెట్టారు. మరో ప్రత్యేకత ఏంటంటే... ఆయన పుట్టిన తేదీ డిసెంబర్ 29. అదే తేదీలో 2సార్లు బడ్జెట్లు ప్రవేశపెట్టారు. అవి రెండూ లీఫ్ ఇయర్సే కావడం మరో స్పెషాలిటీ. ఇక మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం 9 బడ్జెట్లు సమర్పించారు. కాంగ్రెస్ అధ్యక్షతన UPA-1, UPA-2లో ఆయన వీటిని ప్రవేశపెట్టారు. ఆ తర్వాత రికార్డు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పేరున ఉంది. ఆయన ఆర్థిక మంత్రిగా 8 బడ్జెట్లు ప్రవేశపెట్టారు. ఇక ఆర్థిక శాఖలో అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించిన మన్మోహన్ సింగ్ 6 బడ్జెట్లు ప్రవేశపెట్టారు. దేశంలో ప్రధానిగా వీపీ నరసింహారావు ఆర్థిక సంస్కరణలు తెచ్చినప్పుడు మన్మోహన్ సింగే ఆర్థిక మంత్రిగా చేశారు. అరుణ్ జైట్లీ 5 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఐతే... 2019 ఫిబ్రవరిలో జైట్లీకి అనారోగ్యం రావడంతో... ఆయన ప్లేస్‌లో పియూష్ గోయల్ మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు. ప్రస్తుత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ప్రవేశపెట్టేది 2వ బడ్జెట్. అలాగే... ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ ఉండగా ఇది 8వది. ఐతే... నిర్మలమ్మకు ఓ రికార్డ్ దక్కింది. స్వాతంత్ర్యం వచ్చాక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన 2వ మహిళ ఆమె. అంతకుముందు... 1969-70లో ఇందిరాగాంధీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.