ప్రపంచాన్ని కరోనా వైరస్ భయం వెంటాడుతోంది. కరోనా ప్రభావం ఆర్థిక రంగాలపై కూడా తీవ్రమైన ప్రభావం చూపుతుండటంతో ఈ వైరస్ ప్రపంచానికి పెనుముప్పుగా మారింది. ప్రాణ నష్టంతో పాటు ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థ పై కరోనా దెబ్బకొడుతుంది. ఇక దీనికి ఇంతవరకు ఎవరు వ్యాక్సిన్ కనిపెట్టలేదు. చైనాలోని వుహాన్ నగరం నుంచి కరోనా వైరస్ పుట్టుకొచ్చినట్టు చెబుతున్నప్పటికీ.. ఎలా అది బయటకొచ్చిందన్నది అంతుచిక్కడం లేదు.ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తికి సంబంధించి సోషల్ మీడియాలో అనేక ప్రచారాలు జరుగుతున్నాయి.
అందులో ఒకటి.. చైనా వాళ్ల ఆహారపు అలవాట్లే కరోనా వైరస్‌కు కారణమయ్యాయన్న విమర్శ. చైనీయులు ఏ జీవిని వదలకుండా తినడం వల్లే ప్రపంచానికి కరోనా ముప్పు వచ్చిందని చాలామంది సోషల్ మీడియాలోనూ,బయట అభిప్రాయ పడుతున్నారు. అయితే , కరోనా వైరస్ వ్యాప్తికి ఆహారపు అలవాట్లే కారణమని ఎక్కడా నిర్దారణ కాలేదు. అయిన ఇప్పుడు వారి ఆహారపు అలవాట్లపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. చైనీయుల ఈ ఆహారపు అలవాట్ల వెనుక అసలైన కారణం ఏమిటి అంటే .. చైనాలో వన్యప్రాణుల వినియోగం ఈ స్థాయిలో ఉండటానికి ప్రధాన కారణం.. ఆనాటి కమ్యూనిస్టు యోధుడు మావో జెడాంగ్ అని చాలామంది చెప్తుంటారు. ఆయన అవలంభించిన 'గ్రేట్ లీప్ ఫార్వర్డ్' విధానమే దేశంలో ఈరకమైన ఆహారపు అలవాట్లకు కారణమైందని చెబుతారు. దేశాన్ని వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ నుండి పారిశ్రామిక దేశంగా మార్చడం దీని ముఖ్య లక్ష్యం.
అయితే, ఆ క్రమంలో 1958 నుంచి 1962 మధ్య మావో జెడాంగ్ అవలంభించిన కఠినమైన విధానాలు, సోషల్ క్యాంపెయిన్ వంటివి దేశాన్ని తీవ్ర సమస్యల్లోకి నెట్టాయని చెబుతారు. ఆ నాలుగేళ్లలో చైనాను ఆహార కొరత తీవ్రంగా కుదిపేసింది. చైనాలోని హౌస్టన్-డౌన్‌టౌన్ కి చెందిన పీటర్ జే లీ అనే పరిశోధకుడి ప్రకారం.. చైనా నాయకత్వ విధానాల వల్ల దేశంలో ఆహార కొరతను కొనితెచ్చుకున్నట్టయింది. పారిశ్రామికీకరణలో భాగంగా జనాభాలో ఎక్కువ మందిని వ్యవసాయం నుంచి పరిశ్రమల వైపు మళ్లించడంతో జనాభాకు తగినంత తిండి దొరకని పరిస్థితి తలెత్తింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఆఫీసర్లు, సైనికులు, సాధారణ పౌరులు.. ఇలా ప్రతీ ఒక్కరూ తిండి కోసం వేట మొదలుపెట్టారు. ఆ కారణంగా కనిపించిన ప్రతి ప్రాణిని చంపి తినడం మొదలు పెట్టారు.
నిజానికి చైనాలో వన్యప్రాణులను తినడమనేది మొదట దక్షిణ చైనాకే పరిమితమైంది. కానీ ఆ తర్వాతి కాలంలో అది చైనా అంతటా విస్తరించింది. అదే సమయంలో చైనా జనాభా కూడా పెరిగిపోవడంతో.. వన్యప్రాణి మాంసానికి తీవ్ర స్థాయిలో డిమాండ్ ఏర్పడింది.1988 లో చైనా వన్యప్రాణుల రక్షణ చట్టాన్ని రూపొందించినప్పటికీ.. దాని అమలు చేయడం కుదరలేదు. ఆలా చైనా ఆహార సంస్కృతి లో వన్యప్రాణులు కూడా ఒక భాగంగా మారిపోయాయి. దానికి తోడు ప్రతీ వన్య ప్రాణి మాంసంలో ఏదో ఒక ఔషధ గుణం ఉంటుందని చైనీయులు నమ్ముతుంటారు. అలా దాదాపుగా ప్రతీ కుటుంబం వన్యప్రాణి మాంసాన్ని తినడం అక్కడ అలవాటుగా మారిపోయింది.