ఢిల్లీ ప్రభుత్వ పార్టీ ఆప్(ఆమ్ ఆద్మీ), బీజేపీ నాయకులు ఒకరిపై ఒకరు పడి మరీ కొట్టేసుకున్నారు. చిత్తుచిత్తుగా పిడిగుద్దులు గుద్దేసుకున్నారు. బండ బూతులు తిట్టుకున్నారు. అది కూడా ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ హాల్ వేదికగా కావడం గమనార్హం. మరి ఇంతగా రెచ్చిపోవడానికి కారణం ఏంటి? ఎందుకు? అనేది ఆసక్తిగామారింది.
ఢిల్లీ ల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిక్లలో ఆప్ విజయం దక్కించకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మేయర్ ఎన్నికను చేపట్టారు. అయితే.. ఇదే తీవ్ర ఆందోళన, వివాదానికి కారణంగా మారింది. మేయర్ ఎన్నికకు సంబంధించి ప్రిసైడింగ్ అధికారి నియామకం విషయంలో లెఫ్టినెంట్ గవర్నర్ వ్యవహరించిన తీరుపై ఆప్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ విమర్శలు గుప్పించింది.
ఈ క్రమంలో ఆప్-బీజేపీ నేతలు చేయి చేయి చేసుకుని కలబడ్డారు.
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నికకు సంబంధించి లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా.. 10 మంది కో-ఆప్షన్ సభ్యులను నియమించారు. దీనిని ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. అయితే.. సక్సేనా నిర్ణయాన్ని బీజేపీ కార్పొరేటర్లు సమర్ధించారు.
ఈ క్రమంలో ఇరు పక్షాలు పరస్పరం వాగ్వాదానికి దిగారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు.. ప్రిసైడింగ్ అధికారిగా బీజేపీ కార్పొరేటర్ సత్యశర్మను.. లెఫ్టినెంట్ గవర్నర్ నియమించడంపైనా ఆప్ నేతలు మండిపడ్డారు.
మేయర్ ఎన్నికను ప్రభావితం చేసేందుకే సక్సేనా ఈ నిర్ణయం తీసుకున్నారని ధ్వజమెత్తారు. కో-ఆప్షన్ సభ్యుడిగా మనోజ్ కుమార్‌ను ప్రమాణం చేయాలని ప్రిసైడింగ్ అధికారి ఆహ్వానించడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఆప్ నేతలు.. వెల్‌లోకి దూసుకెళ్లారు. అందుకు పోటీగా.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా బీజేపీ సభ్యులు నినాదాలు చేశారు. ప్రధాని మోడీ లక్ష్యంగా ఆప్ నేతలు విరుచుకుపడ్డారు. దీంతో ఇరు పక్షాలు తన్నేసుకోవడం గమనార్హం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.