రాష్ట్రంలో బీజేపీ నేతల పరిస్థితి ఏంటి? వారు అధికారంలోకి రావాలనే కోరికను పదే పదే ప్రకటిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తామని అంటున్నారు. అయితే.. వారి వ్యూహాలు ఏమైనా ఉన్నాయా? కేవలం మాటలేనా? అనే చర్చ తెరమీదికి వస్తోంది.
ఎందుకంటే.. బీజేపీ ప్రాంతీయ పార్టీకాదు. జాతీయ పార్టీ.. జాతీయ స్థాయిలో పార్టీకి కొన్ని లక్ష్యాలు ఉన్నాయి. వాటి ప్రకారం మేనిఫెస్టో రూపొందుతుంది. అయితే.. స్టేట్ విషయానికివస్తే.. మాత్రం ఈ మేనిఫెస్టో ఫెయిల్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి. ఇప్పటి వరకు పార్టీ ఎదుర్కొన్న ప్రధాన సమస్య కూడా ఇదే.
ఎందుకంటే.. స్టేట్‌లో చూసుకుంటే.. ప్రజలకు ప్రత్యేక హోదాపై మక్కువ అలానే ఉంది. హోదా ఇవ్వబోమని.. సెంట్రల్ బీజేపీ నాయకులు.. కేంద్ర ప్రభుత్వం కూడా పదే పదే చెబుతోంది. ఈ క్రమంలో హోదాపై ప్రజల ఆశలు తగ్గేలా స్టేట్ లీడర్లు ప్రయత్నం చేయాలి.
కానీ.. ఇప్పటి వరకు ఈ ఎనిమిది సంవత్సరాల్లో అలా నాయకులు ప్రవర్తించలేదు. ప్రజల మనసులు కూడా మార్చింది లేదు. అదేసమయంలో కేంద్రంలోని బీజేపీ నాయకులుఏపీని అసలు పట్టించుకోవడం లేదని.. ఇక్కడి ప్రజలు ప్రభుత్వం కూడా భావిస్తున్నాయి.
పోనీ.. దీనిని కూడా తుడిచేసేందుకు నాయకులు ప్రయత్నం చేయలేదు. ఈ నేపథ్యంలో అసలు రాష్ట్రంపై బీజేపీ రాష్ట్ర నేతల ముద్ర ఉందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తాము ఏం చేయాలని అనుకుంటున్నామో.. కూడా వారు చెప్పలేక పోతున్నారు. పోనీ.. ప్రజలు కోరుతున్నదైనా చేస్తామని చెప్పే ధైర్యం కూడా చేయలేక పోతున్నారు. అంటే.. ఒక రకంగా.. రాష్ట్రంపై కేంద్రం ముద్ర కనిపిస్తున్నదే (యాంటీ యాంగిల్‌లో)తప్ప.. రాష్ట్ర నేతల ముద్ర కనిపించడం లేదనే టాక్ వినిపిస్తోంది.
ఈ క్రమంలో పార్టీ ఏవిధంగా పుంజుకుంటుంది? ఎలా ముందుకుసాగుతుంది? రాజధానిపై కప్పగంతులు వేస్తున్నారు. విశాఖ ఉక్కుపై రాష్ట్ర నేతలకు ఒక మాట.. కేంద్రంలోని పెద్దలది మరో మాట. ఇక, వెనుక బడిన జిల్లాల పరిస్థితి ఏంటి? కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామన్న మాట ఏమైంది? కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మిస్తామనే హామీ ఏమైంది? ఇలా అనేక అంశాలు వారిని చుట్టుముడుతున్నాయి.
ఈ క్రమంలో ఇప్పటికైనా.. బీజేపీ ఎదగాలంటే.. కేంద్రం ముద్రను తుడిచేసి.. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఇక్కడి నాయకులు వ్యూహాలు సిద్ధం చేసుకుంటేనే బెటర్ అంటున్నారు పరిశీలకులు.