బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు: సైలెన్స్ వెనుక కాంప్రమైజ్?

Update: 2023-01-19 03:30 GMT
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో అడ్డంగా బుక్కైన బీజేపీ ఏజెంట్ల కేసు అనుకోని మలుపులు తిరుగుతోంది. బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ ఫైట్ మధ్యన ఈ కేసు అతీగతీకాకుండా పోయింది. ఈ కేసులో బీజేపీ పెద్దలను కూడా ఇరికించడానికి కేసీఆర్ ప్రయత్నించారు. బీజేపీ, నిందితులు హైకోర్టు కు వెళ్లడంతో మలుపు తిరిగింది. ఈ కేసును సీబీఐకి అప్పగించింది హైకోర్టు. అయితే సిట్ తోనే దర్యాప్తు చేయించాలని కేసీఆర్ సర్కార్ వాదించింది. ఈ వాదోపవాదాలు.. సింగిల్ బెంచ్ టు డివిజన్ బెంచ్ కు కేసు వెళ్లింది.

ఇప్పుడు హైకోర్టులో డివిజన్ బెంచ్ విచారణ తీర్పును రిజర్వ్ చేసింది. ప్రభుత్వం తరుఫున లాయర్లు వాదించడమే కాకుండా.. లిఖితపూర్వకంగా వాదనలు సమర్పిస్తామని చెప్పడంతో 30వ తేదీ వరకూ గడువు ఇచ్చింది. దీంతో తీర్పును ఈలోపు రాదని తేలిపోయింది. ఇక అప్పటివరకూ సీబీఐని విచారణ జరపకుండా హైకోర్టు హోల్డ్ చేసింది. అయితే స్టే మాత్రం ఇవ్వలేదు. సీబీఐ విచారణ ప్రారంభించవచ్చు.

అయితే తెలంగాణలో సీబీఐ ఎంట్రీకి నిషేధం ఉంది. దీంతో తెలంగాణ ప్రభుత్వాన్ని అనుమతి కోరుతూ కేసుల వివరాలు ఇవ్వాలని సీబీఐ లేఖ రాసింది. తెలంగాణ ప్రభుత్వం మాత్రం సీబీఐ అనుమతిని రద్దు చేయడంతో ఇప్పుడు పర్మిషన్ ఇవ్వడంలో జాప్యం చేస్తోంది.

డివిజన్ బెంచ్ తీర్పు వచ్చేవరకూ తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో ముందుకు వెళ్లకూడదని డిసైడ్ అయ్యింది. ఈ కారణంగానే సీబీఐ విచారణ కూడా ఇంకా ప్రారంభం కాలేదని తెలుస్తోంది. ఈ విషయంలో ఇటు బీఆర్ఎస్.. అటు బీజేపీ మౌనంగా ఉండడం.. సీబీఐ కూడా సైలెంట్ అవ్వడం వెనుక కాంప్రమైజ్ అయ్యారా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. 


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News