వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్‌రెడ్డి దాదాపు నాలుగేళ్ల సుదీర్ఘ విరామం.. మౌనం తర్వాత..ఇప్పుడు నేనేమీ చేయలేదు.. నాకేమీ సంబంధం లేదు.. అని అవినాష్‌రెడ్డి వ్యాఖ్యానించడం.. ఎప్పుడూ లేని విధంగా మీడియా మీటింగులు పెట్టడం.. సొంతగా సెల్పీ వీడియోలు చేయడం వంటివి గమనిస్తే.. అవినాష్ చెప్పేది నిజమేనా? లేక.. పీకల వరకు కేసు ముసురుకున్న నేపథ్యంలో ఆయన దానిని ఏదో చేయాలని భావిస్తున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదే విషయం రాజకీయ వర్గాల్లోనూ చర్చకు వస్తోంది. నిప్పులేనిదే పొగరాదన్నట్టు సామెత ఉంది. పైగా.. సీబీఐ వంటి రాజ్యాంగ సంస్థ అనూహ్యంగా ఒకరిపైనింద మోపాలని అనుకుంటే.. ఈ కేసులో ఇరికించేం దుకు అనేక మందిని తీసుకువచ్చే ప్రయత్నం చేయొచ్చు. కానీ, అలా చేయలేదు. అదేసమయంలో ముందు అనుమానించినా.. తర్వాత.. క్లీన్ చిట్ పొందిన బీటెక్ రవి, ఆదినారాయణరెడ్డి వంటి వారు కూడా ఉన్నారు. ఇదేసమయంలో వైఎస్ కుటుంబానికే చెందిన వారు కూడా కనిపిస్తున్నారు.
మరి అలాంటప్పుడు. ఏపాపం లేకుండానే.. ఏ ప్రమేయం లేకుండానే సీబీఐ ఈ కేసులో తనను ఇరికిం చిందని.. తన తండ్రిని జైలుకు పంపించిందని ఎంపీ అవినాష్ చెబుతుండడం.. అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. అవినాష్ చెబుతున్నట్టుగా వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖర్‌లు.. సీబీఐతో కుమ్మక్కు కావడానికి రీజన్ కనిపించడం లేదు. ఆస్తుల కోసమే చేశారని అన్నా.. దీనికి గట్టిగా.. వైఎస్ కుటుంబానికే చెందినషర్మిల సమాధానం చెప్పారు.
ఒకవేళ ఆస్తుల వివాదాలు.. కుటుంబ వివాదాలు ఉంటే.. ఏకంగా తండ్రిని చంపించేంత సాహసం చేయా లా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. పోనీ.. ఇదే అనుకున్నా.. వివాదం ఇప్పటిది కాదు. మరి హఠాత్తుగా ఎన్నికలకు ముందుగా ఎందుకు జరిగింది? అంటే.. దీనికి కూడా అవినాష్ రెడ్డి దగ్గర సమాధానం లేదు. అదేసమయంలో ద్వితీయవివాహం చేసుకున్నారని.. సునీత ఆగ్రహంతో ఉన్నారని చెబుతున్న దానిలోనూ పసకనిపించడం లేదని అంటున్నారు పరిశీలకులు.
ద్వితీయ వివాహం అనేది.. వైఎస్ బతికి ఉన్నప్పుడు జరిగింది. సో.. కుటుంబ కలహాలు.. ఆస్తి వివాదాలు అంటూ.. అవినాష్ ఎంత చెప్పినా.. ఆయన చెబుతున్న దానిలో లాజిక్ కనిపించడం లేదని అంటున్నారు రాజకీయ వర్గాలు.