క్రీడాకారుల విషయంలో ఈ ఓవరాక్షన్ ఏమిటి?

Update: 2021-02-20 17:30 GMT
అనుమతులు అన్ని ఉన్నా.. రూల్ బుక్ లోని రూల్ ను మూర్ఖంగా చూపిస్తే ఇబ్బంది పెట్టే అధికారులు కొందరు ఉంటారు. తమకు తెలిసింది మాత్రమే చట్టం అనుకునే వారి తీరు తరచూ వివాదాస్పదం కావటమే కాదు.. వారి బారిన పడిన వారంతా తీవ్ర ఆవేదనకు గురి కావాల్సి వస్తుంది. తాజాగా అలాంటి చేదు అనుభవమే ఎదురైంది భారత యువ షూటర్ మను బాకర్ కు. తాజాగా ఆమె భోపాల్ నుంచి దేశ రాజధాని ఢిల్లీ వెళుతున్నారు.

షూటింగ్ క్రీడాకారిణిగా ఆమెకు గన్ ను తీసుకెళ్లేందుకు అనుమతులు ఉంటాయి. వాటికి సంబంధించిన పేపర్లు ఉన్నాయి. అయినప్పటికీ.. ఆమెను అడ్డుకున్న ఢిల్లీ ఎయిర్ పోర్టు అధికారులు ఓవరాక్షన్ చేశారు. ఆమె వద్ద ఉన్న పిస్టల్ మాత్రమే చూసే అధికారులు.. తన దగ్గర అన్ని అనుమతులు ఉన్నాయని.. తనకు ప్రభుత్వం ఇచ్చిన పత్రాల్ని చూడాలని ఎంత కోరినా స్పందించింది లేదు.

అంతేకాదు..నిబంధనలకు విరుద్ధంగా ఆమె గన్లను తీసుకెళుతుందంటూ రూ.10200 ఫైన్ వేశారు. దీంతో.. చిర్రెత్తిపోయిన ఆమె.. తనకు ఎదురైన అనుభవానని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కేంద్ర క్రీడల మంద్రి కిరెన్ రిజిజు.. విమానయాన శాఖామంత్రి హర్ దీప్ సింగ్ లకు ఆమె కంప్లైంట్ చేశారు.

దీనిపై వెంటనే స్పందించిన కేంద్రమంత్రులు సీన్లోకి వచ్చేశారు. ఆమె ఎయిర్ పోర్టులో వెళ్లేందుకు వీలుగా ఆదేశాలు జారీ చేశారు. తనకు ఎదురైన చేదు అనుభవం గురించిన స్పందించిన మను బాకర్.. తనను అధికారులు అనవసరంగా ఆపి నేరస్తురాలి మాదిరి చూశారన్నారు. తనను గౌరవించకున్నా ఫర్లేదు కానీ.. అవమానించొద్దన్న ఆమె మాటలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.
Tags:    

Similar News