ఈసీకి విజయసాయి ఏమని లేఖ రాశారు?

Update: 2019-04-13 11:31 GMT
ఈవీఎంలపైనా.. వాటి భద్రత మీదా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి.. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అనుమానాలు వ్యక్తం చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఈవీఎంలను భద్రపర్చిన సెంటర్ల వద్ద భద్రతను పెంచాలని ఆయన కోరారు. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం అధికారులకు ఆయన ఒక లేఖ రాశారు.

ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈసీకి సహకరించే పరిస్థితులు లేకపోవటంతో ఈవీఎంలను భద్రపర్చిన కేంద్రాల వద్ద  కేంద్ర బలగాల్ని మొహరించాలని ఆయన కోరటం గమనార్హం. ఎందుకిలా? అన్న సందేహానికి సమాధానం తన లేఖలో చెప్పేశారు. ఈసీకి రాష్ట్ర ప్రభుత్వం సహకరించే పరిస్థితులు లేని నేపథ్యంలో ఈవీఎం భద్రపర్చిన కేంద్రాల వద్ద సీఐఎస్ఎఫ్.. సీఆర్పీఎఫ్ లాంటి కేంద్ర బలగాల్ని ఏర్పాటు చేయాలన్నారు.

ఈవీఎంలను భద్రపర్చిన కేంద్రాల వద్ద 24 గంటలు పని చేసేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఓట్లు లెక్కింపునకు చాలానే సమయం ఉన్నందున స్ట్రాంగ్ రూమ్ ల వద్ద గట్టి నిఘా పెట్టాలన్నారు. ఎన్నికల సంఘం మీద చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఆయనీ లేఖ రాసినట్లుగా తెలుస్తోంది.

స్వేచ్ఛగా.. నిష్పక్షపాతంగా.. ఎన్నికలు నిర్వహించినందుకు ఎన్నిక సంఘానికి విజయసాయి రెడ్డి పార్టీ తరఫున ధన్యవాదాలు తెలిపారు. ఓపక్క ఎన్నికల నిర్వహణపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర విమర్శలు.. ఆరోపణలు చేస్తున్న వేళ.. అందుకు భిన్నంగా ఈసీని మెచ్చుకుంటూ విజయసాయి లేఖ రాయటం ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.


    

Tags:    

Similar News