మిత్రుడి కోసం కేసీఆర్ ఏం చేశాడంటే

Update: 2017-11-25 16:49 GMT
తెలంగాణ సీఎం కేసీఆర్‌లోని ఆత్మీయ‌త‌కు ఇదో తార్కాణం. దోస్తీకి తెలంగాణ సీఎం కేసీఆర్ ఎంత‌టి ప్రాధాన్యం ఇస్తారో తెలియ‌జెప్పేందుకు మ‌రో ఉదాహ‌ర‌ణ ఇది. ముప్పై ఏళ్ల కితం త‌న‌తో క‌లిసి ప‌నిచేసిన మిత్రుడు ప‌క్షవాతం కార‌ణంగా అనారోగ్యం పాలయ్యాడ‌ని తెల‌సుకున్న గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్‌...స్వ‌యంగా ఆయ‌న ఇంటికి వెళ్లి ప‌ల‌క‌రించాడు. దీంతో ఆయ‌న కుటుంబ‌ స‌భ్యుల్లో ఆనందం వెల్ల‌విరిస్తోంది.

హైద‌రాబాద్‌లోని గాంధీనగర్‌ డివిజన్‌లో ఉన్న ఉదయ సఫేర్‌ అపార్ట్‌మెంట్స్‌లో నివసిస్తూన్న కే.రాజేంద్ర ప్రసాద్‌ను శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పరార‌ర్శించారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన మిత్రుడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. దాదాపు 30 ఏళ్ల‌ క్రితం తనతోపాటు యూత్‌ కాంగ్రెస్‌లో పని చేసిన రాజేంద్రప్రసాద్‌ ఇటీవల అస్వస్తతకు గురైనట్లు తెలుసుకున్న సీఎం కేసీఆర్‌ ఆయనను పరామ‌ర్శించిన సంద‌ర్భంగా 20 నిమిషాల పాటు రాజేంద్రప్రసాద్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు. అలనాటి స్మృతులను గుర్తు చేసుకున్నారు.

కాగా తన మిత్రుడు కేసీఆర్‌ బిజీగా ఉన్నప్పటికి గుర్తుపెట్టుకొని మా ఇంటికి వచ్చి ఫలకరించి వెళ్లడం సంతోషంగా ఉందని, 15 సంవత్సరాల తరువాత ఇద్దరం కలిశామని రాజేంద్రప్రసాద్‌ తెలిపారు. రాజేంద్రప్రసాద్‌ భార్య విజయలక్షీ, కూతురు జోస్న, కుమారుడు గోపాలకృష్ణలను వైద్య సేవలు అందిస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. కాగా, గాంధీనగర్‌లో ఉన్న ఉదయ్‌ సఫెర్‌ అపార్ట్‌మెంట్స్‌ వస్తున్నారన్న విషయం అందరికి తెలియడంతో పెద్ద ఎత్తున్న టీఆర్‌ఎస్‌ నాయకులు కార్యకర్తలు భారీగా చేరారు. తమ కాలనీకి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ వస్తున్నా  విషయాన్ని తెలుసుకుని ఆ కాలనీ ప్రజలు ఆశ్య్చర్యానికి లోనయ్యారు.
Tags:    

Similar News