ఏపీ రాజకీయాలు రోజుకో రకంగా మారుతున్నాయి. అధికార పార్టీ వైసీపీ, ప్రతిపక్షం టీడీపీల మధ్య యు ద్ధం రోజుకో రూపం దాల్చింది. వైసీపీ అధినేతను తిట్టిపోశారంటూ.. టీడీపీ కార్యాలయంపై వైసీపీ కార్యక ర్తలు దాడికి దిగారు. ఇక, ఈ దాడికి నిరసనగా.. టీడీపీ అధినేత చంద్రబాబు నిరసన దీక్ష చేపట్టారు. ఇక, నిరసన దీక్షకు సమాంతరంగా.. వైసీపీ.. టీడీపీ క్షమాపణలు చెప్పాలంటూ.. వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన దీక్షలు చేపట్టింది. ఇక, అదేసమయంలో టీడీపీ అధినేత రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో రెండు పార్టీలూ దూకుడుగానే వ్యవహరించాయి.
ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు దూషించుకున్నారు. సవాళ్లు రువ్వుకున్నారు. నువ్వెంత అంటే.. నువ్వెంత అని వ్యాఖ్యలు సంధించుకున్నారు. సో.. మొత్తానికి రెండు పార్టీల నేతలు.. దొందు.. దొందూ అనే రీతిలో వ్యవహరించారు. అయితే.. ఈ రెండు పార్టీల వ్యవహారంపై ఇప్పుడు సోషల్ మీడియాలోను.. జనసామాన్యంలోనూ అనేక విమర్శలు వస్తున్నాయి. రెండు ప్రధాన పార్టీలు.. ఒకటి నిన్న మొన్నటి వరకు అధికారంలో ఉంది. మరొకటి అధికారంలో ఉంది. అయితే.. ఈ రెండు బాధ్యతాయుత పార్టీలు.. కూడా వ్యక్తిగత ఇగోలకు.. స్వప్రయోజనాలకు ప్రాధాన్యం ఇచ్చాయనే వాదన బలంగా వినిపిస్తోంది.
రాష్ట్రంలో ప్రజుల నిత్యవసర సరుకుల ధరలు పెరిగిపోయి.. ఇబ్బందులు పడుతున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి.. సామాన్యుల జీవితం నరకంగా మారిపోయింది. మరి ఈ సమస్యలపై ఎవరైనా.. అటు చంద్రబాబుకానీ.. ఇటు వైసీపీ నాయకులు కానీ.. దీక్షలు చేశారా? ప్రజలకోసం.. ఒక్కనాడైనా.. రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారా? అనేది సామాన్యుల మాట. వ్యక్తిగత ప్రయోజనమే ప్రజాస్వామ్యం అని.. తమ ప్రయోజనాలకు భంగం కలిగితే.. ప్రజాస్వామ్యం కూనీ అయిందని వ్యాఖ్యలు చేసి.. రోడ్డెక్కడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తుండడం గమనార్హం.
ప్రస్తుతం రాష్ట్రం పరిస్థితి అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో అడుగున ఉంది. పెట్టుబడులు రావడం లేదు. ఉపాధి లేక వలసలు పెరుగుతున్నాయి. పైగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావడం లేదు. దీంతో పనులు ముందుకు సాగకపోగా.. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వైజాగ్ ఉక్కు కర్మాగారాన్ని అమ్మేస్తామని.. కేంద్రం పదే పదే చెబుతోంది. మరి ఇంత జరుగుతున్నా.. వైసీపీ కానీ.. టీడీపీ కానీ .. ఆయా సమస్యలపై రాష్ట్ర వ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చారా? రాష్ట్ర వ్యాప్త ధర్నాలకు కూర్చున్నారా? దీక్షలు చేశారా? అనేది ప్రశ్న.
అంతేకాదు.. రాయలసీమలోని వెనుకబడిన జిల్లాలు, ఉత్తరాంధ్రలోని వెనుక బడిన జిల్లాల కోసం.. వారు ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా? చేశారా? అనేది ఇప్పుడు ప్రధానంగా చర్చకు వస్తున్న ప్రశ్న. మరి వీటిని అంటే.. ఎవరైతే.. రేపు ఓట్లు వేసి గెలిపించాలని టీడీపీ కోరుతోందో.. అదే ప్రజలు.. ఎవరి ఓట్లతో అయితే.. వైసీపీ అధికారంలోకి వచ్చిందో.. అదే ప్రజలు నేడు ప్రశ్నిస్తున్నారు. దీనికి సమాధానం చెబుతారా? ఈ రెండుపార్టీల నాయకులు. చూడాలి.. ప్రజలు ఏం చేస్తారో.