రషీద్ ను ఎస్ఆర్ హెచ్ వదలుకోవడానికి కారణమిదే?

Update: 2021-12-01 14:30 GMT
ఐపీఎల్ 2022 సీజన్ కు సంబంధించి అన్ని పనులను బీసీసీఐ చకాచకా చేస్తోంది. ఇప్పటికే అన్ని ఫ్రాంఛైజీలు రిటెన్షన్ లిస్టును కూడా వెల్లడించాయి. ఇక మెగా వేలానికి సమయం ఆసన్నమైంది. డిసెంబర్ లోనే మెగా వేలం ఉండే అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా మన సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రం అందరినీ వదులుకొని షాక్ ఇచ్చింది. ఎస్.ఆర్.హెచ్ రిటెన్షన్ విషయంలో తెలుగు అభిమానులు గుర్రుగా ఉన్నారు.

ఇప్పటికే మాజీ కెప్టెన్.. ఒకసారి కప్ ను అందించిన డేవిడ్ వార్నర్ ను సన్ రైజర్స్ వదిలేశారని కారాలు మిరియాలు నూరుతూ సన్ రైజర్స్ పై మండిపడుతున్నారు. తాజాగా రషీద్ ఖాన్ ను కూడా రిటైయిన్ చేసుకోలేకపోవడంతో ఆ కోపం ఇంకాస్త ఎక్కువైంది అభిమానులకు.. ఈ క్రమంలోనే సన్ రైజర్స్ పై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మిస్టరీ స్పిన్నర్ రషీద్ ఖాన్ ను ఎందుకు రిటైన్ చేసుకోలేదని.. యాజమాన్యం వద్దందా? రషీద్ జట్టులోకి రానన్నాడా? ఆ విషయంలో తప్పు ఎవరిది? అనే ప్రశ్నలకు సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు.

తాజాగా ఐపీఎల్ లో వచ్చిన కొత్త జట్టు లక్నో.. రషీద్ ఖాన్ ను సంప్రదించిందని.. రూ.16 కోట్లు ఆఫర్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. రషీద్ ఆ మొత్తం ఇస్తేనే తాను సన్ రైజర్స్ జట్టుతో కొనసాగుతానని.. లేదంటే నా దారి నేను చూసుకుంటానని తేల్చిచెప్పినట్లు సమాచారం. చేసేది ఏమీ లేక రషీద్ ఖాన్ను హైదరాబాద్ రిటైన్ చేసుకోలేకపోయిందని సమాచారం.

ఈ విషయంలో సన్ రైజర్స్ జట్టు యాజమాన్యం తప్పేమీ లేదని.. రషీద్ ఖాన్ జట్టు వీడేందుకు సిద్ధమైనట్లు సమాచారం.

ఇలా ముందు వార్నర్, తర్వాత రషీద్ ఖాన్ లు సన్ రైజర్స్ జట్టును వీడుతుండడంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా హైదరాబాద్ టీంపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఇద్దరు మంచి ఆటగాళ్లను డీల్ సెట్ చేసుకోలేక వదులుకుందని ఆడిపోసుకుంటున్నారు.




Tags:    

Similar News