కరోనా నుంచి కోలుకున్న తర్వాత మధుమేహం వస్తుందని పలువురు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మహమ్మారి నుంచి కోలుకున్న తర్వాత కొందరు డయాబెటీస్ లక్షణాలతో తమ వద్దకు వస్తున్నారని తెలిపారు. రక్తపోటు, మధుమేహం ఉన్న వారికి వైరస్ సోకితే ప్రమాదం. అయితే వైరస్ నుంచి కోలుకున్న పదిశాతం మందిలో చక్కెర స్థాయి అమాంతం పెరుగుతున్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. కరోనా చికిత్సలో ఉపయోగించే ఔషధాల వల్లే ఇలా జరుగుతోందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
కొవిడ్ చికిత్సలో ఉపయోగించే స్టెరాయిడ్స్ శరీరంలోని చక్కెర స్థాయిలను పెంచుతాయని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా కరోనా వైరస్ ఏసీఈ-2 రిసెప్టర్లను ఊపిరితిత్తులకు అతుక్కునేలా చేస్తాయని చెప్పారు. ఇవి క్లోమ గ్రంథిపై ఉండే బీటా కణాలపై ఉంటాయి. వైరస్ వీటిపై దాడి చేస్తుంది. ఫలితంగా ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గుపోతుంది. అలా శరీరంలోని చక్కెర స్థాయి పెరుగుతుంది. చాలామందికి మధుమేహం ఉన్నా కొందరు గ్రహించరు. కానీ రక్త పరీక్షలో మాత్రం గుర్తించవచ్చు.
ప్రీడయాబెటిక్ ఉన్నవారికి కొవిడ్ సోకితే చక్కెర స్థాయి అమాంతం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మూడు నెలల పాటు సాధారణంగా ఉన్న హెచ్బీఏ-1సి నివేదికల్లో ఒక్కసారిగా పెరిగిన చక్కెర స్థాయిలను సూచిస్తుంది. కరోనా సోకి తేలికపాటి లక్షణాలు ఉన్నవారిలోనూ ఈ సమస్య తలెత్తుతోందని బాధితులు చెబుతున్నారు. ఎలాంటి స్టెరాయిడ్లు తీసుకోకపోయినా డయాబెటిక్కు గురయ్యామని అంటున్నారు. వంశపారంపర్యంగా ఈ సమస్య లేని వారికీ కరోనా తర్వాత సోకే ప్రమాదం ఉందన్నారు.
కరోనా తర్వాత వచ్చిన మధుమేహం కొన్ని రోజుల్లో తగ్గిపోతుందని అంటున్నారు. అయితే టైప్ 2 డయాబెటిక్ లో చక్కెర స్థాయిలో అధికంగా ఉన్నాయని గుర్తించారు. ఇది జీవితాంతం ఉంటుందని తెలిపారు. దీనిపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయని వెల్లడించారు. కరోనా నుంచి కోలుకున్నాక చక్కెర స్థాయిని పరీక్షించుకోవాలని సూచించారు. 180 రోజుల్లో డయాబెటీస్ ను నియంత్రణలోకి తీసుకురావాలని చెప్పారు. షుగర్ లెవెల్స్ 70-180 మధ్య ఉండాలని తెలిపారు.
కరోనా నుంచి కోలుకున్నాక కొన్నాళ్ల పాటు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. పౌష్టికాహారం తినాలని సూచించారు. వేపుళ్లు, తీపి పదార్థాలకు దూరంగా ఉండాలని అన్నారు. నీటి స్థాయి తగ్గిపోకుండా రోజూ తగినంత నీరు తాగాలని చెప్పారు.