ఇంటర్నెట్ విప్లవం పుణ్యమా అని ప్రపంచం సైతం చిన్న కుగ్రామంగా మారిపోయిన పరిస్థితి. ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా.. దాని గురించి తెలుసుకోవటం ఈ మధ్యన ఎక్కువైంది. ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేసిన బ్రెగ్జిట్ గురించి ప్రఖ్యాత సెర్చింజన్ గూగులమ్మను తెగ వెతికేసినట్లుగా గూగుల్ చెబుతోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. బ్రెగ్జిట్ గురించి. .యూరోపియన్ యూనియన్ గురించి.. ఒకవేళ బ్రెగ్జిట్ నుంచి బ్రిటన్ విడిపోతే జరిగే విపరిణామాలు ఏమిటి? యూరోపియన్ సమాఖ్యపై ఈ ఫలితం ప్రభావం ఎలా ఉంటుంది? లాంటి వివరాలు చాలామంది బ్రిటీషర్లకు తెలీదంట.
అందుకే.. బ్రెగ్జిట్ ఫలితాలు వెలువడిన తర్వాత ఈ వివరాల కోసం బ్రిటీషర్లు పలువురు గూగులమ్మను తెగ వెతికేశారట. ఫలితం వెలువడిన తర్వాత అత్యధికులు ఒక ప్రశ్నకు సమాధానాన్ని విపరీతంగా శోధించారట. అదేమంటే.. ‘‘మనం యూరోపియన్ యూనియన్ నుంచి విడిపోతే ఏమవుతుంది’’ అన్న అంశంపై శోధించినట్లుగా గూగుల్ పేర్కొంది. అంతేకాదు.. యూరోపియన్ యూనియన్ లో ఎన్ని దేశాలు ఉన్నయి? అదెప్పుడు స్టార్ట్ అయ్యింది? అసలు యూరోపియన్ యూనియన్ అంటే ఏమిటి? లాంటి విషయాలపై కూడా బ్రిటీషర్లకు చాలా తక్కువగా తెలుసన్న విషయం గూగులమ్మను వెతికిన తీరుతో స్పష్టమైనట్లుగా చెబుతున్నారు.
ఈ సందర్భంగా గూగుల్ సెర్చ్ లో సంధించిన ప్రశ్నల్ని గూగుల్ వెల్లడించింది. దీని ప్రకారం.. ‘‘నేను ఈయూ రిఫరెండంలో ఎలా ఓటు వేయాలి? ఈయూ రిఫరెండంలో ఎవరెవరు ఓట్లు వేయొచ్చు? ఈయూ రిఫరెండం ఎప్పుడు నిర్వహిస్తారు? నేను ఎక్కడ ఓటు వేయొచ్చు? మనం ఈయూలో ఎందుకు ఉండాలి? మనం ఈయూను ఎందుకు వదిలేయాలి? మనం వదిలేస్తే ఏం జరుగుతుంది? అసలు కామెరాన్ ఎందుకు రిఫరెండంకు పిలిచారు? అసలు డేవిడ్కామెరాన్ వయసెంత?’’ లాంటి ప్రశ్నల్ని సంధించారట.
అన్నింటికి మించి.. ‘‘మనం యూరోపియన్లమేనా’’ అన్న ప్రశ్నను చాలా ఎక్కువ మంది అడిగినట్లుగా గూగుల్ వెల్లడించింది. గూగులమ్మచెబుతున్న లెక్కను చూస్తుంటే.. బ్రెగ్జిట్ కోసం నిర్వహించిన రెఫరెండంలో పాల్గొన్న వారిలో ఈ ఉదంతం గురించి పూర్తి అవగాహన లేకుండా ఓటింగ్ లో పాల్గొన్నారా? అన్న భావన కలగటం ఖాయం.