బ‌ద్వేల్‌లో ఏం జ‌రుగుతోంది? బీజేపీ భ‌రోసా ఏంటి?

Update: 2021-10-27 14:30 GMT
క‌డ‌ప జిల్లాలోని ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం బ‌ద్వేల్‌కు ఈ నెల 30న ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. బుధ‌వారంతో ఇక్క‌డ ప్ర‌చారం ప‌రిస‌మాప్తి కానుంది. అయితే.. ఇక్క‌డ ప్ర‌ధాన పార్టీల్లో ఒక్క అధికార వైసీపీ త‌ప్ప ఏవీ పోటీ చేయ డం లేదు. బీజేపీ ఇక్క‌డ అభ్య‌ర్థిని నిల‌బెట్టింది. కానీ, అధికార ప‌క్షం మాత్రం భారీ రేంజ్‌లో ప్ర‌చారం చేస్తోం ది. ఏకంగా 9 మంది మంత్రులు ప‌ది మంది ఎంపీలు.. జిల్లాలోని ఎమ్మెల్యేలు అంద‌రూ ఇక్కడ ప్ర‌చార ప‌ర్వంలో ముందున్నారు. మ‌రి.. బీజేపీ ఒక్క‌టే పోటీ లో ఉంటే.. వైసీపీ ఎందుకు ఇంత‌గా హ‌డావుడి చేస్తోం ది? అనేది ప్ర‌శ్న‌.

దీనిపై వైసీపీ వ‌ర్గాల నుంచి ఒక కీల‌క విష‌యం బ‌య‌ట‌కు వ‌స్తోంది. ఇక్క‌డ  బీజేపీతో ఒక కీల‌క పార్టీ సైలెం ట్ స్నేహం చేస్తోంద‌ని.. వారు చెబుతున్నారు. లోపాయికారీగా.. ఏదో జ‌రిగింద‌ని.. అందుకే.. ఒక్క‌డ స‌ద‌రు పార్టీ అభ్య‌ర్థిని ప్ర‌క‌టించిన త‌ర్వాత కూడా వెన‌క్కి తీసుకుంద‌ని.. ఒక విశ్లేష‌ణ చేస్తున్నారు. అంతేకాదు.. ప్ర‌చారంలోనూ అప్ర‌మ‌త్తంగా ఉన్నామ‌ని వైసీపీ నాయ‌కులు చెబుతున్నారు. వాస్త‌వానికి ఇక్క‌డ బీజేపీకి పెద్ద‌గా ఓటు బ్యాంకు లేదు. అయిన‌ప్ప‌టికీ.. ఇక్క‌డ భారీ ఎత్తున ఖ‌ర్చు పెడుతూ.. పోటీకి దిగింది. వాస్త‌వానికి త‌మ‌కు బ‌లం లేద‌ని తెలిసి కూడా బీజేపీ నేత‌లు ఎందుకు దిగుతున్నార‌నే ప్ర‌శ్న అప్ప‌ట్లోనే చ‌ర్చ‌కు వ‌చ్చింది.

అయితే.. దీనివెనుక రాష్ట్రంలోని ఒక కీల‌క పార్టీ ప‌రోక్షంగా ఇక్క‌డ త‌మ‌కున్న ఓటు బ్యాంకును బీజేపీకి బ‌ద‌లాయించే ప్ర‌యత్నం చేస్తోంద‌ని.. అందుకే బీజేపీ ఇంత ధైర్యంగా ఇక్క‌డ పోటీకి దిగింద‌ని వైసీపీ నేత‌లు బాహాటంగానే చెబుతున్నారు. అయితే.. ఆ పార్టీ ఏంట‌నేది మాత్రం ఎవ‌రూ వెల్ల‌డించ‌డం లేదు. నిజానికి ఎన్నిక‌ల‌కు ముందు ఒక పార్టీ అభ్య‌ర్థిని ప్ర‌క‌టించింది. త‌ర్వాత‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న పార్టీ ఇక్క‌డ పోటీ చేయ‌డం లేద‌ని.. సానుభూతి కోణంలోనే తాము త‌ప్పుకొంటున్నామ‌ని.. ఆయ‌న ప్ర‌క‌టించారు.

ఆ త‌ర్వాత మ‌రికొన్ని పార్టీలు ఇక్క‌డ పోటీ నుంచి  విర‌మించుకున్నాయి. వీటిలో ఒక పార్టీ.. బీజేపీతో ర‌హ‌స్య స్నేహం చేస్తోంద‌ని.. దీనిలో భాగంగానే బీజేపీకి స‌హ‌క‌రిస్తోంద‌ని వైసీపీ నాయ‌కులు చెబుతున్నా రు. అందుకే తాము భారీ ఎత్తున మోహ‌రించిన‌ట్టు చెబుతున్నారు. మ‌రి ఇది నిజ‌మేనా?  బీజేపీకి స‌హ‌కరి స్తున్న పార్టీ ఏది? వంటి విష‌యాలు ఆస‌క్తిగా మారాయి. మ‌రి ఇక్క‌డ ప్ర‌జ‌ల తీర్పు ఎలా ఉంటుందో చూడాలి.
Tags:    

Similar News