అనవసరంగా పార్టీలు రాద్దాంతం చేసుకుంటున్నాయా ? క్షేత్రస్థాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకుంటున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని అస్సాం ముఖ్యమంత్రి హిమంత శర్మపై తెలంగాణలో కాంగ్రెస్ నేతలు పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు చేస్తున్నారు. అప్పుడెప్పుడో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని కేసీఆర్ పైన బీజేపీ నేతలు ఫిర్యాదులు చేస్తున్నారు.
ఇందులో ఒక్కటి కూడా ఉపయోగపడేది లేదు. అస్సాం ముఖ్యమంత్రిపైన తెలంగాణాలో ఫిర్యాదులు చేస్తే ఏమవుతుంది ? అసలు ఒక ముఖ్యమంత్రిపైన మరో రాష్ట్రంలో ఫిర్యాదులు చేస్తే పోలీసులు కేసు నమోదు చేస్తారా ? అలాగే కేసీయార్ పైన అస్సాంలో బీజేపీ నేతలు ఫిర్యాదులు చేస్తే ఏమవుతుంది ? రాహుల్ పైన అస్సా సీఎం అనుచిత వ్యాఖ్యలు చేసింది వాస్తవమే. అయితే అందుకు కాంగ్రెస్ నేతలు చేయాల్సిందేమిటంటే అస్సాం పోలీసు స్టేషన్లలోనే ఫిర్యాదులు చేయాలి.
అస్సాం సీఎంపై అస్సాం పోలీసులు ఫిర్యాదులు తీసుకోకపోతే అప్పుడు కోర్టును అప్రోచ్ అయినా అర్ధముంటుంది. అలాగే అస్సాంలో కేసీయార్ పైన ఫిర్యాదులు చేసినంత మాత్రాన ఏమీకాదు.
ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం అవినీతిపైన కోర్టుల్లో కేసులు వేస్తామని కేసీయార్ ప్రకటించటం కూడా ఫక్తు రాజకీయంగానే కనబడుతోంది. కేంద్ర ప్రభుత్వం అవినీతికి పాల్పడిందనే ఆరోపణలతో కోర్టుల్లో కేసులు వేస్తే ఏమవుతుంది ? ఏమీ కాదు.
ఎందుకంటే అవినీతికి పాల్పడిందని స్పష్టమైన ఆధారాలతో కేసులు వేస్తేనే అది తేలటానికి సంవత్సరాలు పడుతోంది. నరేంద్ర మోడీ మీద కోపంతో కేసీయార్ కోర్టుల్లో కేసులు వేస్తే పెద్దగా ఉపయోగం ఉంటుందని ఎవరు అనుకోవటం లేదు.
మొత్తం మీద ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేయటం, కోర్టుల్లో కేసులు వేస్తామని బెదిరించటం మొత్తం రాజకీయంగా రాద్దాంతం చేయటానికి మాత్రమే పనికొస్తుంది. పైగా ఇలాంటి చేష్టల వల్ల సమాజంలో గందరగోళం తప్ప మామూలు జనాలకు పనికొచ్చేది ఏమీలేదు.