విశాఖ ఉక్కు.. ల‌క్షా 68 వేల కోట్ల కుంభ‌కోణం!

Update: 2021-03-10 11:30 GMT
ఆంధ్రుల హ‌క్కుగా ప్ర‌తి ఒక్క‌రూ ప‌రిగ‌ణించే విశాఖ ఉక్కు క‌ర్మాగారాన్ని.. వంద శాతం అమ్మేస్తున్నామం టూ... కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో అస‌లు ఇక్క‌డ ఏం జ‌రుగుతోంద‌నే చ‌ర్చ జోరుగా సాగుతోంది. ఎందుకు అమ్ముతున్నారు? అనే ప్ర‌శ్న‌కు... కేంద్రం త‌మ‌కు న‌ష్టాలు వ‌స్తున్నాయ‌ని.. ప్ర‌జ‌ల సొమ్ముతో వ్యాపారాలు చేయ‌లేమ‌ని.. చిత్ర‌మైన వాద‌న‌ను వినిపించింది. అదేస‌మ‌యంలో ప్ర‌స్తుతం విశాఖ ప్లాంటు విలువ‌ను 32 వేల కోట్లుగా పేర్కొంది. అంతేకాదు, ఉత్పాద‌న‌ను పెంచ‌డానికి, నూత‌న సాంకేతిక‌త‌ను ప్ర‌వేశ పెట్టడానికి... మ‌రింతగా ఉద్యోగ అవ‌కాశాలు పెంచేందుకు తాము ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని.. సాక్షాత్తూ.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ పార్ల‌మెంటులో వెల్ల‌డించారు..

అయితే...కేంద్రం చెబుతున్న వాద‌న‌లో నిజ‌ముందా? విశాఖ ఉక్కులో నిజంగానే న‌ష్టాలు వ‌స్తున్నాయా? అంటే.. ఉత్ప‌త్తి కొద్దిగా స‌న్న‌గిల్లినా.. న‌ష్టాలేమీ రావ‌డం లేద‌న్న‌ది నిపుణుల మాట‌. కేంద్ర ప్ర‌భుత్వ మూల ధ‌న పెట్టుబ‌డి 5 వేల కోట్లు మాత్ర‌మే. కానీ. ఇప్పుడు ప్ర‌భుత్వ అంచ‌నాల ప్ర‌కారం దీని విలువ 32 వేల కోట్లు. అంటే.. ఆరు రెట్లు ఆస్తి విలువ పెరిగింది. కానీ, ప్లాంటుకున్న 20 వేల ఎక‌రాల భూముల విలువ‌.. ప్లాంటు విలువ‌ను క‌లిపితే.. దాదాపు రెండు ల‌క్ష‌ల కోట్లుగా ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు. కానీ, కేంద్ర ప్ర‌భుత్వం మాత్రం దీనికి న‌ష్టాల ముసుగు తొడిగి... ఉద్దేశ పూర్వ‌కంగా ప్రైవేటు పరం చేసేందుకు కేంద్ర ప్ర‌బుత్వంలోని పెద్ద‌లు ప్ర‌య‌త్నిస్తున్నార‌నేది విశ్లేష‌కుల అంచ‌నా.

అంటే.. రెండు ల‌క్ష‌ల కోట్ల విలువైన ప్లాంటును కేవ‌లం 32 వేల కోట్ల‌కు అమ్మేయడం ద్వారా.. దాదాపు ల‌క్షా 68 వేల కోట్ల కుంభ‌కోణం ఈ ప్లాంటు విష‌యంలో దాగి ఉంద‌ని చెబుతున్నారు. కేవ‌లం భూమి విలువే ల‌క్ష కోట్లు ఉంటుంద‌ని... ఇక‌, ప్లాంటుకు ఉన్న స్థిర, చ‌రాస్థుల విలువ మ‌రో ల‌క్ష కోట్లు ఉంటుంద‌ని.. కానీ, ఇ ప్పుడు ఈ మొత్తాన్ని 32 వేల కోట్లుగా చూపుతున్నార‌ని.. దీనిలో భారీ స్కాం దాగి ఉంద‌ని నిపుణులు చెబు తుండ‌డం గ‌మ‌నార్హం. ఈ మొత్తాన్నీ ఆదానీ కో.. పోస్కోకో.. కేవ‌లం 32 వేల కోట్ల‌కు క‌ట్ట‌బెట్ట‌డం ద్వారా తాము ల‌బ్ధి పొందాల‌నే వ్యూహం ఉంద‌ని కేంద్ర పెద్ద‌ల‌ను ఉద్దేశించి వ్యాఖ్య‌లు వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

ఇక‌, ఇలా ద‌క్కించుకున్న ఈ ప్రైవేటు సంస్థ‌లు .. ఉక్కును ఉత్ప‌త్తి చేస్తాయా? లేక విలువైన భూముల్లో రియ‌ల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాయా? అంటే.. ఖ‌చ్చితంగా రియ‌ల్ బిజినెస్ వైపే అడుగులు వేస్తాయి. ఎన్నిక‌ల స‌మ‌యంలో `పెద్ద‌ల‌కు` సాయం చేస్తాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌స్తుతం ప్లాంటుపై ఆధార‌ప‌డిన దాదాపు 20 వేల కుటుంబాలు ఆర్థికంగా, కుటుంబప‌రంగా న‌ష్ట‌పోవ‌డంతోపాటు ఆంధ్రుల హ‌క్కుకు తూట్లు ప‌డ‌డం ఖాయంగా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు నిపుణులు. ఈ నేప‌థ్యంలో తెలుగు ప్ర‌జ‌లు ప్రాంతాల‌కు, పార్టీల‌కు అతీతంగా పోరాటం చేయ‌డం ద్వారా.. కేంద్రంలోని పెద్ద‌ల‌కు బుద్ధి చెప్పాల‌నేది నిపుణుల మాట‌.
Tags:    

Similar News