క‌లసి రాని త‌మ్ముళ్ల‌తో టీడీపీకి ఎంత క‌ష్టం.. ఎంత న‌ష్టం...!

Update: 2022-02-15 01:04 GMT
పార్టీ అధినేత చంద్ర‌బాబు శ‌పథం చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ముఖ్య‌మంత్రి అయ్యాకే.. అసెంబ్లీలో అడుగు పెడ‌తాన‌ని చెప్పారు. ఈ క్ర‌మంలోనే పార్టీని దూకుడుగా ముందుకు తీసుకు వెళ్లాల‌ని ఆయ‌న ప్ర‌య‌త్నిస్తున్నారు. ఎక్క‌డ ఏం జ‌రిగినా.. ఆయ‌న ముందు ఉంటున్నారు. అంతేకాదు.. ఎక్క‌డ ఎలాంటి ప‌రిస్థితి వ‌చ్చినా.. ఆయ‌న వెళ్లిపోతున్నారు.

నాయ‌కుల‌ను..స్థాయీ భేదం కూడా చూడ‌కుండా.. ప‌ల‌క‌రిస్తున్నారు. అయితే.. క్షేత్ర‌స్థాయిలో మాత్రం ఈ త‌ర‌హా.. ప‌రిస్థితి టీడీపీలో క‌నిపించ‌డం లేదు. చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇంచార్జుల‌కు.. కీల‌క నేత‌ల‌కు మ‌ధ్య పొస‌గ‌డం లేదు. అనంత‌పురం జిల్లా నుంచి శ్రీకాకుళం వ‌ర‌కు ఇదే త‌ర‌హా ప‌రిస్థితి క‌నిపిస్తోంది.

విజ‌యన‌గ‌రం చూసుకుంటే.. మాజీ మంత్రి అశోక్ గ‌జ‌ప‌తి ఇల్లు వ‌దిలి బ‌య‌ట‌కు రావ‌డం లేదు. ఎక్క‌డ కేసులు పెడ‌తారో అని అనుకుంటున్నారో.. లేక‌.. ఇంకా ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ఉంద‌ని అనుకుంటున్నారో తెలియ‌దు. ఇక‌, ఆయ‌న కుమార్తె కొన్నాళ్లు యాక్టివ్ఃగా ఉన్నారు త‌ర్వాత‌.. మాయ‌మై పోయారు. దీంతో ఇక్క‌డ కేడ‌ర్‌ను న‌డిపించే నాయ‌కులు క‌నిపించ‌డం లేదు.

ఇక‌.. శ్రీకాకుళంలో ఇంచార్జ్‌లు యాక్టివ్ఃగా ఉంటే.. కీల‌క నేత‌లు మౌనంగా ఉంటున్నారు. వారిపై వ్య‌క్తిగ‌త కోపం కావొచ్చు.. లేదా ఆధిప‌త్య ధోర‌ణి కావొచ్చు.. మొత్తంగా.. చూస్తే.. ఇంచార్జ్‌ల‌కు, కీల‌క నాయ‌కులకు మ‌ధ్య పొస‌గ‌డం లేద‌న్న‌ది వాస్త‌వం. నిజానికి పార్టీ రాష్ట్ర చీఫ్ అచ్చెన్నాయుడు ఇక్క‌డివారే అయినా.. ఇంచార్జ్‌ల‌కు ఆయ‌న‌కు మ‌ధ్య విభేదాలు కొన‌సాగుతున్నాయి.

ఇక‌, విశాఖ‌లో త‌మ్ముళ్ల ప‌రిస్థితి ఎవ‌రి దారి వారిదే. న‌లుగురు ఎమ్మెల్యేలు గెలిచినా.. ఒక్క‌రూ కూడా పార్టీకి కీల‌కంగా మార‌లేక పోతున్నారు. మాజీ మంత్రి గంటా మౌనం వ‌హించారు. మ‌రో ఎమ్మెల్యే పార్టీకి దూరంగా ఉన్నారు. ఇంకో ఇద్ద‌రిలో ఒక‌రు సైలెంట్ అయితే.. మ‌రొక‌రు మాత్ర‌మే కొంత తెర‌మీద‌కు వ‌స్తున్నారు. ఇక‌, మ‌హిళా నేత‌.. అనిత‌.. మాత్రం కొన్ని కార్య‌క్ర‌మాల‌ను ఏరుకుని వాటికి మాత్ర‌మే హాజ‌ర‌వుతున్నార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అంటే.. త‌న‌కు పేరు వ‌స్తుంద‌ని భావిస్తున్న కార్య‌క్ర‌మాల‌కు మాత్రమే ఆమె అటెండ్ అవుతున్నారు.  దీంతో కేడ‌ర్‌లో చైత‌న్యం క‌ల‌గ‌డం లేదు. ముఖ్యంగా న‌గ‌రం ప‌రిస్తితి ఎలా ఉన్నా.. జిల్లాలో మాత్రం టీడీపీని న‌డిపించే నాధుడు క‌నిపించ‌డం లేదు. మ‌రి దీనికి కార‌ణం ఏంటో తెలియాలి.

ఇక‌, తూర్పులో ఒక‌రిద్ద‌రు త‌ప్ప‌.. మిగిలిన వారు సైలెంట్ గా ఉన్నారు. గోరంట్ల బుచ్చ‌య్య ఒక్క‌రే మీడియా ముందుకు వ‌స్తున్నారు. మ‌రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భ‌వానీ.. ఏం చేస్తున్నారో.. ఆమెకే తెలియాలి. ప‌శ్చిమ‌లో ఎప్పుడూ వినిపించే నిమ్మ‌ల రామానాయుడు గొంతు కూడా ఇటీవ‌ల కాలంలో మూగ‌బోయింద‌నే అంటున్నారు. ఇక‌, విజ‌య‌వాడ‌, కృష్ణా జిల్లాలో కూడా నేత‌ల మ‌ధ్య స‌ఖ్య‌త క‌నిపించ‌డం లేదు. మాజీ మంత్రి దేవినేని ఉమ వ‌ర్గం ప్ర‌త్యేకంగా కార్య‌క్ర‌మాలు చేస్తే.. బొండా ఉమా.. ఒంట‌రిగానే మీడియా ముందుకు వ‌స్తున్నారు. గుంటూరులో ఎవ‌రికి వారే త‌మ‌త‌మ అజెండాల‌ను అమ‌లు చేసుకుంటున్నారు.

పార్టీ త‌ర‌ఫున ఎవ‌రూ క‌ల‌సి క‌ట్టుగా ముందుకు సాగ‌డం లేదు. ఇలా.. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే త‌ర‌హా ప‌రిస్థితి క‌నిపిస్తోంద‌న్న‌ది టీడీపీలోనూ చ‌ర్చ‌కు దారితీస్తోంది. అయిన‌ప్ప‌టికీ.. చంద్ర‌బాబు నుంచి లోకేష్ వ‌ర‌కు దీనిని స‌రిచేసేందుకు ప్ర‌య‌త్నించ‌క‌పోవ‌డం మ‌రో లోపంగా ఉంది. మ‌రి ఎన్నిక‌ల నాటికి కూడా ఇదే ప‌రిస్థితి ఉంటే.. చంద్ర‌బాబు శ‌ప‌థం నెర‌వేరేది ఎలానో.. నేత‌లే తేల్చుకోవాలని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Tags:    

Similar News