కిమ్ జోంగ్ ఉన్ .. ప్రపంచంలో ఉన్న వ్యక్తుల్లో అత్యంత నియంతగా పేరు తెచ్చుకున్న వ్యక్తి. ఈయనను తేనెపూసిన కత్తి లాంటి వ్యక్తిగా అభివర్ణిస్తారు. ఎందుకంటే పైకి అమాయకంగా కనిపించే ఆయన... మనుషుల్ని చంపించడంలో ఏమాత్రం వెనకాడడు. ఏ చిన్న డౌట్ వచ్చిన చాలు అత్యంత నమ్మకమైన వ్యక్తులను, కుటుంబ సభ్యులను కూడా దారుణంగా చంపిస్తాడు. అదికూడా అత్యంత కిరాతకంగా. తన నీడనే నమ్మలేని ఒక రకమైన శాడిస్టు ఆయన అంటారు చాలా మంది.
తాజాగా ఆయన భార్య రి సోల్ జు విషయం కలకలం రేపుతోంది. ఏడాది నుంచి ఆమె కనిపించట్లేదు. ఎప్పుడో జనవరి 25, 2020లో చివరిసారి తన భర్తతో కలిసి, రాజధాని ప్యాంగ్ యాంగ్ లో ఓ థియేటర్ దగ్గర దేశ ప్రజలకు కనిపించారు. అప్పటి నుంచి మళ్లీ కనిపించినది లేదు. ఈ విషయంపై ఇంటర్నెట్‌లో రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి.
కిమ్ జోంగ్ ఉన్ ఆదేశించడం వల్లే ఆమె బయటకు రావట్లేదనే వాదన కొందరు చేస్తుంటే... కరోనా వైరస్ తనకు సోకకూడదు అనే ఉద్దేశంతోనే స్వయంగా ఆమే బయటకు రావట్లేదనే వాదన మరికొందరు చేస్తున్నారు. దీనిపై నార్త్ కొరియా రీసెర్చ్ డివిజన్ డైరెక్టర్ హాంగ్ మిన్ స్పందించారు. ఆమె కరోనా కారణంగానే బయటకు రావట్లేదని. పిల్లల బాధ్యత చూసుకుంటున్నారని చెప్పారు. అంతెందుకు కిమ్ జోంగ్ ఉన్ కూడా పెద్దగా బయటకు కనిపించట్లేదు కదా అందుకు కారణం కరోనాయే అని చెప్పారు. కరోనాకు ముందు నిత్యం సంచలన విషయాలతో వార్తల్లో నిలిచే కిమ్ ఇటీవల కాలంలో పెద్దగా వార్తల్లో కనిపించడం లేదు.