వాట్సాప్ చాట్ సాక్ష్యం కాదు.. కోర్టు సంచలనం

Update: 2021-11-01 09:32 GMT
డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన ఆర్యన్ ఖాన్ దాదాపు 27 రోజులు జైల్లో ఉండి ఇటీవలే బెయిల్ పై విడుదలయ్యాడు. అతడి బెయిల్ కోసం సుప్రీంకోర్టు దిగ్గజ లాయర్ ముకుల్ రోహత్ గీ చేసిన బలమైన వాదన ఫలించింది. ఎన్సీబీ సాక్ష్యాలను తుత్తునియలు చేసేలా ఆయన వాదించి షారుఖ్ ఖాన్ కుమారుడికి బెయిల్ ఇప్పించారు.

ఇప్పటికీ ఆర్యన్ ఖాన్ బెయిల్ కోసం 5 సార్లు పిటిషన్లు వేసినా ముంబయ్ సెషన్స్ కోర్టు తిరస్కరించిది. ఆర్యన్ ఖాన్ వద్ద ఎలాంటి డ్రగ్స్ లభించకపోయినా ఆయనను నేరస్థుడిగానే పరిగణించిన ఎన్సీబీ అతడిని అదుపులోకి తీసుకుంది. ఆయనతో సంబంధాలున్న వారిని తెలుసుకునేందుకు ఆయన కస్టడీ అవసరమరి ఎన్సీబీ అధికారులు కోర్టుకు విన్నవించారు. అయితే ఆర్యన్ ఖాన్ స్నేహితుడు అర్భాజ్ ఖాన్ వద్ద డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతడు ఆర్యన్ ఖాన్ తోనే ఉన్నాడన్న నెపంతో ఈ నేరంలో అతడు కూడా బాధ్యుడేనని ఎన్సీబీ కోర్టుకు తెలుపుతోంది. ఈనేపథ్యంలో ఆర్యన్ ఖాన్ కు బెయిల్ నిరాకరణపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఈనెల 2న క్రూయిజ్ షిప్ లో డ్రగ్స్ వినియోగిస్తున్నారన్న ఆరోపణతో ఆర్యన్ ఖాన్ న్ ఎన్సీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆయనతో పాటు 20 మందిని అరెస్టు చేశారు. నిందితులపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాఫిక్ సబ్ స్టాన్సెస్ యాక్ట్ చట్టంలోని 20 బీ, 27, 28 తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే మూడు వారాలు గడుస్తున్న ఆర్యన్ ఖాన్ కు బెయిల్ దొరకడం లేదు. అతని వద్ద ఎలాంటి డ్రగ్స్ ఉన్నట్లు సాక్ష్యాలులేకున్నా నేరస్థుడి ఎలా పరిగణిస్తారని ఆర్యన్ తరుపున న్యాయవాదులు పేర్కొన్నారు.

ఆర్యన్ ఖాన్ బెయిల్ నిరాకరణపై ఎన్సీబీ పలు నివేదికలను సమర్పించింది. ఆర్యన్ ఖాన్ వాట్సాప్ పరిశీలించామని, అతడు డ్రగ్స్ కోసం గుర్తు తెలియని వ్యక్తులతో చాట్ చేశాడన్నారు. పెద్ద మొత్తంలో డ్రగ్స్ కోసం ప్రయత్నించాడని తెలుస్తోందన్నారు. ఈ వివరాలను పరిశీలించిన తరువాత డ్రగ్స్ సరఫరా విషయంలో ఆర్యన్ ఖాన్ కు సంబంధాలున్నట్లు తెలుస్తోంది. ఆయనకు బెయిల్ జారీ చేస్తే మళ్లీ ఈ నేరానికి పాల్పడే అవకాశం ఉందని ఎన్సీబీ అధికారులు తెలిపారు. ప్రాథమిక విచారణ తరువాత పలు వివరాలను సేకరించామని, అయితే లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉందని పలు వాట్సాప్ చాట్ లను ఎన్సీబీ కోర్టుకు సమర్పించింది.

అయితే వాట్సాప్ చాట్ పై ముంబై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆర్యన్ ఖాన్ కు బెయిల్ ఇచ్చే సందర్భంగా చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వాట్సాప్ వాడేవారికి ఊరటనిస్తున్నాయి. ‘ఆర్యన్ ఖాన్, మర్చంట్ కు ఇతడు డ్రగ్స్ సరఫరా చేశాడు అనేందుకు వాట్సాప్ చాట్ మినహా మరే ఆధారాలు లేవు. కేవలం చాటింగ్ ను సాక్ష్యంగా పరిగణించలేము’ అని కోర్టు సంచలన తీర్పునిచ్చింది. అందుకే ఆర్యన్ ను విడుదల చేసినట్టు తెలుస్తోంది.






Tags:    

Similar News