స్మార్ట్ ఫోన్ ప్రతిఒక్కరు ఏం వాడినా వాడకున్నా.. వాట్సప్ వాడటం ఇప్పుడో పెద్ద అలవాటుగా మారింది. వాట్సప్ ను వినియోగించే భారతీయుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. వాట్సప్ ను పలు విధాలుగా వినియోగించే తీరు పెరుగుతూ.. వాట్సప్ కానీ భవిష్యత్తులో ఒక్కసారి ఆగిపోతే పరిస్థితి ఏందన్న వరకూ వెళ్లింది. అయితే.. వాట్సప్ అనుసరిస్తున్న తాజా విధానం పుణ్యమా అని.. ఈ సోషల్ నెట్ వర్క్ మీద కేంద్రం బ్యాన్ పంచ్ వేసే ప్రమాదం ఉందన్న మాట బలంగా వినిపిస్తోంది.
దీనికి నిపుణులు చూపిస్తున్న కారణం కూడా సహేతుకంగా ఉండటం గమనార్హం. ఇటీవల కాలంలో వాట్సప్ ‘‘ఎండ్ టూ ఎండ్ ఎన్ క్రిప్షన్’’ అంటూ ఒక కొత్త ఫీచర్ ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్ తో వినియోగదారుల సమాచారానికి పూర్తి భద్రత అని వాట్సప్ పేర్కొంటోంది. ఇదంతా బాగానే ఉన్నా.. ఈ సాంకేతికత వినియోగానికి ట్రాయ్ అనుమతి ఉండదని చెబుతున్నారు.
దేశంలోని ఆన్ లైన్ సర్వీసుల్లో 40 బిట్ ఎన్ క్రిప్షన్ ను మాత్రమే వినియోగించాలని.. తాజాగా వాట్సప్ వినియోగించిన సాంకేతికత 256 బిట్ అని.. ఇది ట్రాయ్ నిబంధనలకు విరుద్ధంగా ఉందని చెబుతున్నారు. వినియోగదారుల డేటాకు పూర్తి భద్రత కల్పించటమే కాదు.. ఈ ఎన్ క్రిప్షన్ కు సంబంధించిన కీ సైతం వాట్సప్ దగ్గర లేదని.. దీని కారణంగా ఎవరైనా ఇద్దరు వ్యక్తుల మధ్య సమాచార పంపిణీ జరిగితే వారిద్దరి మధ్యనే తప్ప.. వేరెవరూ చూసే అవకాశం లేదని చెబుతున్నారు. ఇది ట్రాయ్ నిబంధనలకు విరుద్ధంగా చెబుతున్నారు. ట్రాయ్ కానీ ఈ ఇష్యూను సీరియస్ గా తీసుకుంటే.. వాట్సప్ పై వేటు పడినా ఆశ్చర్యపోవాల్సింది లేదని చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో.. వాట్సప్ కానీ మిస్ అయితే..? ఊహించటానికి కూడా కష్టంగా ఉంది కదూ..?