వాట్సాప్... ఇంకా పెద్ద గ్రూప్

Update: 2016-02-05 22:30 GMT
వందకోట్ల మైలురాయికి చేరుకున్న ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ మరో కొత్త అప్ డేట్ తో తన వినియోగదారులను ఆకట్టుకుంటోంది. తాజాగా కల్పిస్తున్న ఈ సౌకర్యంపై వాట్స్ యాప్ ఇంకా అధాకారికంగా ప్రకటన చేయనప్పటికీ సాంకేతిక వర్గాలు దీన్ని గుర్తించాయి. వాట్స్ యాప్ గ్రూప్ లో ఇప్పటివరకు కేవలం 100 మంది సభ్యులు మాత్రమే ఉండే వీలుంది... కానీ, కొత్తగా ఇప్పుడు 256 మందిని చేర్చుకునే వెసులుబాటు కల్పించారు. అంటే ఇప్పుడున్న సౌకర్యానికి ఇది రెండున్నర రెట్లు. అయితే... ఇంకా ఇంది ఆండ్రాయిడ్, ఐఓఎస్ లకు మాత్రమే పరిమితం అయింది. విండోస్ - బ్లాక్ బెర్రీ ఓఎస్ లకు మాత్రం ఇంకా 100 మంది సభ్యుల పరిమితి తొలగలేదు. వాట్సాప్ వెర్షన్ నంబర్ 2.12.437 లో ఈ కొత్త సౌకర్యం ఉంది.

ఇటీవల వందకోట్ల క్లబ్ లో చేరిన సందర్భంగా వాట్స్ యాప్ యజమాని మార్క్ జుకర్ బర్గ్ మాట్లాడుతూ...  రానున్న రోజుల్లో మరింత మందికి వాట్సాప్‌ను చేరువ చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. అన్నట్లుగానే కొద్దిరోజుల్లోనే ఈ అప్ డేట్ తో వచ్చారు. వంద కోట్ల యూజర్లు కలిగిన వాట్సాప్‌ ద్వారా రోజుకు 42(42బిలియన్‌) కోట్ల మెసేజ్‌లు బదిలీ అవుతున్నాయి. 1.6 బిలియన్‌ ఫొటోలు షేర్‌ అవుతున్నాయి. 1 బిలియన్‌ గ్రూపులు వాట్సాప్‌లో ఉన్నాయి. గ్రూపు సభ్యుల సంఖ్య పెంచడం వల్ల మెసేజిలు మరింత పెరుగుతాయి.
Tags:    

Similar News