అవును.. వాట్సాప్ మ‌ళ్లీ క్రాష్ అయ్యింది

Update: 2017-12-01 05:51 GMT
నిద్ర లేచించి మొద‌లు రాత్రి నిద్ర‌పోయే వ‌ర‌కూ ప‌ది ఐదు నిమిషాల‌కోసారి స్మార్ట్ ఫోన్ చెక్ చేసుకోవ‌టం ఒక అల‌వాటుగా మారిపోయింది. ఫోన్ చెక్ చేసుకునే ప్ర‌తిసారీ వాట్సాప్ స్టేట‌స్‌ను చూసుకోవ‌టం స్మార్ట్ జీవుల‌కు ఇప్పుడో అల‌వాటుగా మారిపోయింది. స్మార్ట్ ఫోన్‌ను.. వాట్సాప్ ఖాతాను రోజులో చెక్ చేసుకున్న‌న‌న్నిసార్లు ఎవ‌రికి వారు త‌మ గురించి కూడా అన్నిసార్లు ఆలోచించుకోరేమో?

జీవితంలో ఎంతో ముఖ్య‌మైన‌దిగా మారిపోయిన వాట్సాప్ ఆగిపోతే.. ప‌ని చేయ‌కుండా పోతే? ఇంకేమైనా ఉందా?  తాజాగా అలాంటిదే జ‌రిగింది మెసేజింగ్ స‌ర్వీసుల దిగ్గ‌జ‌మైన వాట్సాప్ ఈ రోజు మ‌ళ్లీ మొరాయించింది. ఆ మ‌ధ్య‌న సాంకేతిక కార‌ణాల వ‌ల్ల కాసేపు ప‌ని చేయ‌కుండా పోయిన వాట్సాప్‌.. తాజాగా ఈ ఉద‌యం(శుక్ర‌వారం) మ‌రోసారి మొరాయించింది. వాట్సాప్ ను యాక్స‌స్ చేయ‌టంతో ప‌లు ఇబ్బందులు ఎదుర్కొన్న‌ట్లుగా సోష‌ల్ మీడియాలో ప‌లువురు పేర్కొన్నారు. దాదాపు గంట పాటు స‌ర్వీసు ప‌ని చేయ‌న‌ట్లుగా తెలుస్తోంది.

అర్థ‌రాత్రి నుంచి వాట్సాప్ ఇబ్బంది పెడుతున్న వైనంపై సోషల్ మీడియా హోరెత్తుతోంది.తాజా క్రాష్ మీద‌ #వాట్సాప్‌ డౌన్ పేరిట  ట్వీట్లు వెల్లువెత్తుతున్నాయి. ఇండియా మీద తాజా క్రాష్ ప్ర‌భావం లేద‌న్న మాట వినిపిస్తోంది. రాయిట‌ర్స్ రిపోర్ట్ ప్ర‌కారం ఉత్త‌ర యూర‌ప్‌.. బ్రెజిల్ లో ఈ సారి స‌మ‌స్య ఎక్కువ‌గా ఉన్న‌ట్లు చెబుతున్నారు. ఉన్న‌ట్లుండి వాట్సాప్ ప‌ని చేయ‌క‌పోవ‌టంతో యూజ‌ర్లు కిందామీదా ప‌డుతున్నారు. తీవ్ర అసౌక‌ర్యానికి గుర‌వుతున్నట్లు రిపోర్ట్ వెల్ల‌డించింది.

ప్ర‌పంచ వ్యాప్తంగా 1.3 బిలియ‌న్ల మంది యూజ‌ర్లు ఉన్న వాట్సాప్ కు భార‌త్ లో 200 మిలియ‌న్ల యూజ‌ర్లు ఉన్నారు. మ‌రింత మందిని ఆక‌ట్టుకోవ‌టానికి భారీ ఎత్తున ప్ర‌ణాళిక‌ల్ని సిద్ధం చేస్తోంది వాట్సాప్‌. ఇదిలా ఉండ‌గా.. తాజా క్రాష్ నేప‌థ్యంలో గంట‌కు పైగా ప‌ని చేయ‌లేద‌ని.. ఈ స‌మ‌స్య‌ను ఫిక్స్ చేయ‌టానికి వాట్పాప్ ప్ర‌య‌త్నిస్తోంది. న‌వంబ‌రు 3న కూడా ఇదే విధంగా వాట్సాప్ స‌ర్వీసులు క్రాష్ కావ‌టం.. ఆ సంద‌ర్భంలో భార‌త్ లోని వినియోగ‌దారులు ఇబ్బందులు ఎదుర్కోవ‌టం తెలిసిందే.
Tags:    

Similar News