ప్రపంచ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ నిన్ననే హ్యాకర్ల బారిన పడింది. దాదాపు 5 కోట్ల మంది యూజర్ల డేటాను హ్యాకర్లు దొంగిలించారని ఫేస్ బుక్ ప్రకటించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు షాకిచ్చింది. ఆ చేదు నిజం మరిచిపోకముందే తాజాగా వాట్సాప్ గురించి మరో సంచలన నిజం బయటపడింది. ఈఎస్ఈటీ సెక్యూరిటీ రీసెర్చర్ లుకాస్ స్టెఫాంకో వాట్సాప్ ప్రైవేట్ చాట్లు - కీలక డేటా లీకైనట్లు బాంబు పేల్చాడు. ‘ఓన్ మి’ అనే ఆండ్రాయిడ్ స్పైవేర్ వాట్సాప్ మెసేజ్ - కాంటాక్ట్ - కాల్స్ లాగ్స్ - బ్రౌజింగ్ హిస్టరినీ లీక్ చేస్తున్నట్లు తాజా రిపోర్టులు బయటపెట్టాడు. వాట్సాప్ యూజర్లు జాగ్రత్తగా ఉండాలని.. మొబైల్ మాల్ వేర్ కేసులు పెరుగుతున్నా దృష్ట్యా అప్ డేట్ చేసుకోవాలని సూచించాడు.
ఈ స్పైవేర్ కేవలం హ్యాక్ చేయడమే కాకుండా.. పలు నిఘా ఫీచర్లను కూడా కలిగి ఉందని.. ఈ మాల్ వేర్ ఫోన్లపై అటాక్ కొనసాగిస్తోందని సంచలన విషయాలు వెల్లడించాడు. లుకాస్ ఈ విషయం వెల్లడించగానే వాట్సాప్ రంగంలోకి దిగింది. డీ డేటా సెక్యూరిటీ ల్యాబ్స్ తో కలిసి ఈ కొత్త స్పైవేర్ పై విచారణ ప్రారంభించింది. ఇలా ప్రపంచ సోషల్ మీడియా దిగ్గజాలైన ఫేస్ బుక్ - వాట్సాప్ లు ఒకేసారి హ్యాకర్ల బారిన పడడంతో సంస్థ పేరు ప్రతిష్టలకు భంగం వాటిల్లుతోంది. దీన్ని సరిచేసేందుకు సంస్థలు రంగంలోకి దిగినట్టు తెలిసింది. యూజర్లంతా తమ ముఖ్యమైన డేటాను కాపాడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.