గుర్తించలేని వస్తువులు కొన్ని ముంబయి ఆకాశంలో కనిపించాయి. వీటిని వేలాదిమంది ప్రజలు తమ సెల్‌ఫోన్లతో వీడియో తీసి సోషల్‌నెట్‌వర్క్స్‌లో పెడుతున్నారు. దేశ భద్రత విషయంలో తాము ఎలాంటి రాజీ పడమని గొప్పలు చెప్పుకునే మహారాష్ట్ర సర్కారు మొదలు.. కేంద్రం సైతం.. ముంబయి ఆకాశంలో కనిపించిన విహంగాలు ఏమిటన్నవి ఎవరూ చెప్పలేకపోతున్నారు.
కొందరు మాత్రం వీటిని చైనీస్ లాండర్లుగా అంచనా వేస్తున్నారు. ఆకాశంలోకి అనుమతి లేని వస్తువులు దర్శనమిస్తే.. వాటిని వెనువెంటనే కూల్చి వేయటమో లేదంటే.. వాటిని కిందకు దించే ప్రయత్నం ఏమీ జరగకపోవటం ఆందోళన కలిగించేదే. ముంబయి విమానాశ్రయం మీదన.. ఐటీసీ మరాధా హోటల్ వద్ద కనిపించిన ఈ విహంగాలు ఏమిటన్న దానిపై స్పష్టత లేదు. ఇవి ఎలా వచ్చాయో..? ఎలా మాయమయ్యాయో అన్న విసయాన్ని ఎవరూ చెప్పలేకపోవటం కాస్త చిత్రమైన విషయమే.
ఇక్కడే మరో ఉదంతాన్ని ప్రస్తావించాలి. తాజాగా అమెరికాలో చోటు చేసుకున్న ఈ ఉదంతం చూసినప్పుడు ఏదైనా అనుకోని ఘటన జరుగుతున్న సమయంలో స్పందించే సన్నద్ధత ఎలా ఉండాలో చెప్పకనే చెబుతుంది. అమెరికాపై బాంబులు వేసేందుకు ఒక ఫ్రాన్స్ జెట్ విమానం వస్తుందన్న ఫోన్‌కాల్ వచ్చింది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న అధికారులు.. అదే సమయంలో పారిస్ నుంచి వస్తున్న ఓ ప్యాసింజర్ విమానాన్ని రావటం చూసి దాన్ని అమెరికా యుద్ధ విమానాలు చుట్టుముట్టాయి.
ఆకాశంలోనే ఆ విమానం వెంట పడిన యుద్ధ విమానాలు.. ఫ్రాన్స్ విమానం పైలెట్‌తో కాంటాక్ట్ పెట్టుకొని.. సదరు విమానాన్ని వెంటనే కిందకు దించాలని లేదంటే దాన్ని పేల్చేస్తామని హెచ్చరించి కిందకు దించారు. వెంటనే.. ఆ విమానాన్ని చుట్టుముట్టి.. అందులో ఎలాంటి బాంబులు లేవన్న తర్వాత వదిలేశారు. సన్నద్ధత అంటే అలా ఉండాలి.
అంతేకానీ.. ముంబయిలో గుర్తు తెలీని వస్తువులు ఆకాశంలో ఎగురుతుంటే.. దానికి సంబంధించిన విచారణను మరో రెండు.. మూడు రోజులు పడుతుందని చెబుతున్నారు. అవేవో వచ్చి వెళ్లిపోయాయి కాబట్టి సరిపోయింది. ఏదైనా దాడి చేస్తే.. పరిస్థితి ఏంది? అనుమతి లేకుండా దేశంలోకి అడుగు పెట్టే వాటిని కట్టడి చేయాల్సిన విషయంలో వైఫల్యం చూసినప్పుడు.. దేశ భద్రత ఎంత డొల్లతనంతో ఉందన్న విషయం అర్థం కాక మానదు.