బీజేపీ 'మహా' యాక్షన్ ప్లాన్ ఎప్పుడు స్టార్ట్ చేసిందంటే ?

Update: 2019-11-23 14:30 GMT
మనం కొట్టే దెబ్బకి అవతలి వ్యక్తికి ఎలా తగలాలి అంటే .. మళ్లీ ఆ దెబ్బ నుండి కోలుకోవడానికి కూడా కొన్ని ఏళ్లు పట్టాలి. ఇలా కొంతమంది తమ శత్రుల విషయంలో ఆలోచిస్తూ ..సరైన సమయం కోసం వేచి చూస్తుంటారు. ఆలా అలోచించి ..  ఒక్కసారి అదును చూసి దెబ్బ కొడితే ఎవరైనా అబ్బా అనాల్సిందే. తాజాగా మహారాష్ట్రలో కూడా అలాంటి  ఘటనే జరిగింది. చివరి దాకా ఓడిపోతున్నట్లు కనిపించి, మౌనం వహించిన బీజేపీ , అనూహ్యంగా తెల్లవారేసరికి  విజేతగా నిలిచింది. దెబ్బ అంటే ఇలా ఉండాలి అని చెప్పకనే చెప్పింది. కానీ , బీజేపీ అనుసరించిన ఈ వ్యూహం ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయ్యింది కాదని రాజకీయ విశ్లేషకులు అంఛనా వేస్తున్నారు.

మహారాష్ట్ర లో పగ్గాలు చేపట్టడం తో పాటు రాజకీయంగా, కొన్నేళ్ల పాటు పైచేయి కొనసాగించే విధంగా బిజెపి వేసిన ఎత్తుగడ అమలు చాలా కాలం క్రితమే మొదలైందని అంఛనా వేస్తున్నారు. అయిదేళ్ళ క్రితం అంటే 2014 సార్వత్రిక ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో బిజెపి-శివసేన మధ్య జరిగిన పరిణామాలే దీనికి కారణం అని అంచనా వేస్తున్నారు. అప్పుడు సార్వత్రిక ఎన్నికలు ముగిసిన వెంటనే శివసేన ఎంపీ సురేశ్ ప్రభును బిజెపి తమ పార్టీలో చేర్చుకోవడం సేన అధినాయకత్వానికి నచ్చలేదు.దీనితో  ఆ తర్వాత నాలుగు నెలలకు జరిగిన ఎన్నికల్లో రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేశాయి. సాధారణ మెజారిటీకి కాస్త తక్కువ సీట్లనే సాధించినా బిజెపి అయిదేళ్ళపాటు రాష్ట్రంలో అధికారంలో కొనసాగింది. ఆ తరువాత కలిసి ఉన్నా కూడా లోలోపల మాత్రం ఎవరికీ వారు వ్యూహాలు రచిస్తూ వచ్చారు.

ఈ వ్యూహంలో భాగంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తమపై పూర్తిగా అదరపడేలా చేసుకోవడానికే ..మొన్నటి ఎన్నికలో బీజేపీ పోటీ చేసిన స్థానాలపై శివసేన అంతగా దృష్టి పెట్టలేదు. అందుకే 150 సీట్లలో పోటీ చేసిన బిజెపి 105 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కానీ , శివసేన కంటే రెండాకులు ఎక్కువ చదివిన బీజేపీ నేతలు సేన వ్యూహానికి తలదన్నే వ్యూహాన్ని రచించింది. అందుకే ఎన్నికలకు ముందు శరద్ పవార్, అతని బంధువుల ఇళ్ళపై సిబిఐ దాడులు చేయించడం ద్వారా ఎన్సీపీకి సింపతీ పెరిగేట్లు చేసి.. పరోక్షంగా శివసేన కు సమానంగా ఎన్సీపీ కూడా  సీట్లు పొందేలా చేసుకుంది. శివసేన ఏదైనా తిరకాసు పెడితే ఎన్సీపీ తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయచ్చు అని ముందే ఊహించారు. అందుకే సీఎం  దేవేంద్ర ఫడ్నవీస్ చాలా సందర్భాలలో ధీమాగా కనిపించినట్లు భావిస్తున్నారు.

ఎన్డీయేలో కొనసాగుతూనే తరచూ తలనొప్పులు తెస్తున్న శివసేనను దూరం పెట్టాలని కమలం నేతలు చాలా కాలం క్రితమే నిర్ణయం తీసుకున్నారని సమాచారం. కానీ ,  హార్డ్ కోర్‌ హిందూ పార్టీగా గుర్తింపు ఉన్న శివసేన ని చిన్న చిన్న కారణాలతో పక్కన పెడితే తమకే నష్టం అని భావించి ..అదును చూసి దెబ్బ కొట్టింది.  అందుకే గత నెల రోజులుగా శివసేన ఏమి చేసినా పెద్దగా రియాక్ట్ కూడా కాలేదు.  చివరికి చిరకాలంగా వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీతో శివసేన కలిసి తన క్రెడిబిలిటీ కోల్పోయిన ఆఖరు తరుణంలో బిజెపి వేగంగా పావులు కదిపింది. రాత్రి ఎనిమిది గంటలకు మొదలైన మంతనాలను తెల్లవారుజామున 4 గంటల దాకా కొనసాగించి, ఆ తర్వాత రెండు, మూడు గంటల్లో ప్రమాణ స్వీకారం దాకా తెచ్చేశారు బిజెపి నేతలు. ఏదేమైనా ఈ వ్యూహానికి ప్రధాన వ్యూహకర్తగా అమిత్ షా నే చెప్పాలి ..అమిత్ షా వ్యూహం పన్నితే .. అసాధ్యం అన్నది లేదు అని మరోసారి రుజువైంది.మనం కొట్టే దెబ్బకి అవతలి వ్యక్తికి ఎలా తగలాలి అంటే .. మళ్లీ ఆ దెబ్బ నుండి కోలుకోవడానికి కూడా కొన్ని ఏళ్లు పట్టాలి. ఇలా కొంతమంది తమ శత్రుల విషయంలో ఆలోచిస్తూ ..సరైన సమయం కోసం వేచి చూస్తుంటారు. ఆలా అలోచించి ..  ఒక్కసారి అదును చూసి దెబ్బ కొడితే ఎవరైనా అబ్బా అనాల్సిందే. తాజాగా మహారాష్ట్రలో కూడా అలాంటి  ఘటనే జరిగింది. చివరి దాకా ఓడిపోతున్నట్లు కనిపించి, మౌనం వహించిన బీజేపీ , అనూహ్యంగా తెల్లవారేసరికి  విజేతగా నిలిచింది. దెబ్బ అంటే ఇలా ఉండాలి అని చెప్పకనే చెప్పింది. కానీ , బీజేపీ అనుసరించిన ఈ వ్యూహం ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయ్యింది కాదని రాజకీయ విశ్లేషకులు అంఛనా వేస్తున్నారు.

మహారాష్ట్ర లో పగ్గాలు చేపట్టడం తో పాటు రాజకీయంగా, కొన్నేళ్ల పాటు పైచేయి కొనసాగించే విధంగా బిజెపి వేసిన ఎత్తుగడ అమలు చాలా కాలం క్రితమే మొదలైందని అంఛనా వేస్తున్నారు. అయిదేళ్ళ క్రితం అంటే 2014 సార్వత్రిక ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో బిజెపి-శివసేన మధ్య జరిగిన పరిణామాలే దీనికి కారణం అని అంచనా వేస్తున్నారు. అప్పుడు సార్వత్రిక ఎన్నికలు ముగిసిన వెంటనే శివసేన ఎంపీ సురేశ్ ప్రభును బిజెపి తమ పార్టీలో చేర్చుకోవడం సేన అధినాయకత్వానికి నచ్చలేదు.దీనితో  ఆ తర్వాత నాలుగు నెలలకు జరిగిన ఎన్నికల్లో రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేశాయి. సాధారణ మెజారిటీకి కాస్త తక్కువ సీట్లనే సాధించినా బిజెపి అయిదేళ్ళపాటు రాష్ట్రంలో అధికారంలో కొనసాగింది. ఆ తరువాత కలిసి ఉన్నా కూడా లోలోపల మాత్రం ఎవరికీ వారు వ్యూహాలు రచిస్తూ వచ్చారు.

ఈ వ్యూహంలో భాగంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తమపై పూర్తిగా అదరపడేలా చేసుకోవడానికే ..మొన్నటి ఎన్నికలో బీజేపీ పోటీ చేసిన స్థానాలపై శివసేన అంతగా దృష్టి పెట్టలేదు. అందుకే 150 సీట్లలో పోటీ చేసిన బిజెపి 105 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కానీ , శివసేన కంటే రెండాకులు ఎక్కువ చదివిన బీజేపీ నేతలు సేన వ్యూహానికి తలదన్నే వ్యూహాన్ని రచించింది. అందుకే ఎన్నికలకు ముందు శరద్ పవార్, అతని బంధువుల ఇళ్ళపై సిబిఐ దాడులు చేయించడం ద్వారా ఎన్సీపీకి సింపతీ పెరిగేట్లు చేసి.. పరోక్షంగా శివసేన కు సమానంగా ఎన్సీపీ కూడా  సీట్లు పొందేలా చేసుకుంది. శివసేన ఏదైనా తిరకాసు పెడితే ఎన్సీపీ తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయచ్చు అని ముందే ఊహించారు. అందుకే సీఎం  దేవేంద్ర ఫడ్నవీస్ చాలా సందర్భాలలో ధీమాగా కనిపించినట్లు భావిస్తున్నారు.

ఎన్డీయేలో కొనసాగుతూనే తరచూ తలనొప్పులు తెస్తున్న శివసేనను దూరం పెట్టాలని కమలం నేతలు చాలా కాలం క్రితమే నిర్ణయం తీసుకున్నారని సమాచారం. కానీ ,  హార్డ్ కోర్‌ హిందూ పార్టీగా గుర్తింపు ఉన్న శివసేన ని చిన్న చిన్న కారణాలతో పక్కన పెడితే తమకే నష్టం అని భావించి ..అదును చూసి దెబ్బ కొట్టింది.  అందుకే గత నెల రోజులుగా శివసేన ఏమి చేసినా పెద్దగా రియాక్ట్ కూడా కాలేదు.  చివరికి చిరకాలంగా వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీతో శివసేన కలిసి తన క్రెడిబిలిటీ కోల్పోయిన ఆఖరు తరుణంలో బిజెపి వేగంగా పావులు కదిపింది. రాత్రి ఎనిమిది గంటలకు మొదలైన మంతనాలను తెల్లవారుజామున 4 గంటల దాకా కొనసాగించి, ఆ తర్వాత రెండు, మూడు గంటల్లో ప్రమాణ స్వీకారం దాకా తెచ్చేశారు బిజెపి నేతలు. ఏదేమైనా ఈ వ్యూహానికి ప్రధాన వ్యూహకర్తగా అమిత్ షా నే చెప్పాలి ..అమిత్ షా వ్యూహం పన్నితే .. అసాధ్యం అన్నది లేదు అని మరోసారి రుజువైంది.
Tags:    

Similar News