ఆ వివాదాస్ప‌ద జ‌డ్జి జ‌య‌ల‌లిత‌ను ప్రేమించాడు

Update: 2017-03-28 05:32 GMT
మార్కండేయ కట్జూ గుర్తున్నారా? సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి. త‌న‌దైన శైలిలో ట్వీట్లు - ఇత‌ర రూపాల్లో అభిప్రాయాలు వ్య‌క్తం చేసే రిటైర్డ్ జ‌డ్జీ. ఇలాంటి వాటిల్లో కొన్ని వివాదాస్ప‌దంగా కూడా మారిన సంగ‌తి తెలిసిందే. అలాంటి వ్య‌క్తి ఒకింత గ్యాప్ త‌ర్వాత తెర  మీద‌కు వ‌చ్చారు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితపై తనకు పిచ్చి పిచ్చిగా ప్రేమ ఉంద‌ని చెప్పుకొచ్చారు. విప్ల‌వ నాయ‌కిపై ప్రేమను గతంలో వ్యక్తంచేసిన క‌ట్జూ మరోసారి అదే భావ‌న‌ను సోషల్‌ మీడియాలో ప్రస్తావించారు. దీంతో క‌ట్జూ పోస్ట్‌ వైరల్‌ గా మారింది.

``జ‌య‌ల‌లిత‌ చాలా అందగత్తె. నేను యువకుడిగా ఉన్నప్పుడు ఆమెపై నాకు ప్రేమ కలిగింది. అయితే నాది వన్‌ సైడ్ లవ్. దీని గురించి జయలలితకు తెలియదు`` అని ఫేస్‌ బుక్‌ లో క‌ట్జూ రాసుకొచ్చారు. ఈ పోస్ట్ వైర‌ల్ అవ‌డ‌మే కాదు. ప‌లువురు దీనిపై త‌మ‌దైన శైలిలో రియాక్ట్ కూడా అయ్యారు. గత ఏడాది అక్టోబర్‌ లో జయలలిత తీవ్ర అనారోగ్యంతో చెన్నైలోని అపోలో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నప్పుడు కూడా క‌ట్జూ ఇదే త‌ర‌హాలో పోస్టింగ్ చేశారు. ``ఇప్పటికీ ఆమెను నేను ప్రేమిస్తున్నాను. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను`` అని పేర్కొన్నారు. అయితే, ఆ సమయంలో ఆయన అలా అనడంపై ఎవరి నుంచైనా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతాయన్న భయంతో వెంటనే ఆ సందేశాన్ని వెనుకకు తీసుకున్నారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News