రజనీకాంత్ పక్కన ... నో చెప్పేసిన జయ

Update: 2016-12-08 08:26 GMT
సినిమాలు, రాజకీయాల్లో తిరుగులేని సక్సెస్ సాధించిన తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఒకప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన నటించేందుకు నో చెప్పారట.  ఈ విషయాన్ని ఆమే స్వయంగా ఒక లేఖలో తెలిపారు. తనపై ఒక పత్రికలోని వచ్చిన కాలమ్ లో రాసిన వార్తను ఖండిస్తూ ఆమె రాసిన కాలమ్ లో ఈ అంశాన్ని ప్రస్తావించారు.

     అమ్మ మరణం సందర్భంగా ఆస్ట్రేలియాకు చెందిన బ్రయాన్ లాల్ అనే వ్యక్తి అప్పటి అమ్మ లేఖను పోస్ట్ చేసి   ఫేస్‌బుక్ ద్వారా ప్రపంచానికి ఆ వివరాలు వెల్లడించారు.  జయకు అప్పుడు 32 ఏళ్లు... సినిమాల్లో విజయవంతమైన హీరోయిన్ గా గుర్తింపు పొంది ఆ తరువాత గ్యాప్ తీసుకున్నారు. ఆ సమయంలో  పయస్‌జీ అనే ఒక పత్రికలో ఖాస్‌బాత్ అఃనే కాలమ్‌లో.. జయలలిత మళ్లీ సినిమాల్లోకి వచ్చేందుకు ఇబ్బంది పడుతున్నారని, కానీ అదే సమయంలో రజనీకాంత్ సరసన చేయాల్సిన సినిమాను వద్దనుకున్నారని రాశారు.

    దాన్ని ఖండిస్తూ జయలలిత ఆ పత్రికకు లేఖ రాశారు. అందులో ఏముందంటే... రజనీతో సినిమాలో హీరోయిన్ గా చేయాలని తనను నిర్మాత అడిగారని.. కానీ, తాను ఆ ఆఫర్ ను తిరస్కరించానని చెప్పారు. సినిమాల్లో నటించడం ఇష్టం లేక మానేశానే కానీ ఆఫర్లు లేక కాదు అనడానికి అదే ఉదాహరణ అని ఆమె అందులో చెప్పుకొచ్చారు.  ఆ లేఖ ఇప్పుడు ఫేస్ బుక్ లో తెగ షేర్ అవుతోంది.
Tags:    

Similar News