కొత్త ప్రశ్న? బూస్టర్ డోసు ఎప్పుడు వేసుకోవాలి?

Update: 2021-12-27 05:34 GMT
జాతిని ఉద్దేశించిన ప్రధాని నరేంద్ర మోడీ.. బూస్టర్ డోసులు వేసుకోవాలన్న పిలుపును ఇవ్వటం తెలిసిందే. అయితే.. అందరికి కాకుండా పెద్ద వయస్కులకు.. అనారోగ్యంతో ఇబ్బందులకు గురవుతున్న వారు జనవరిలో బూస్టర్ డోసులు వేసుకోవాలన్న మాట చెప్పటం తెలిసిందే. అయితే.. దీనికి అరవై ఏళ్లకు పైబడిన వారికి.. అనారోగ్య సమస్యలు ఉన్న వారికి ఈ బూస్టర్ డోసు ఇవ్వనున్నారు. జనవరి పది నుంచి ఫ్రంట్ లైన్ వర్కర్లు.. వైద్య రంగంలో పని చేస్తున్న వారు ఈ ముందస్తు జాగ్రత్త (ప్రికాషన్ డోస్) టీకాను వేసుకోవాలన్న మాట ప్రధాని మోడీ నోటి నుంచి వచ్చింది.

ఇదంతా బాగానే ఉంది? ఇంతకీ ఈ బూస్టర్ డోసును ఎప్పుడు వేసుకోవాలన్నది సందేహంగా మారింది. దీనికి తోడు బూస్టర్ డోసును ఏ రీతిలో వేసుకోవాలన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై వైద్య రంగ ప్రముఖులు ఏం చెబుతున్నారన్నది చూస్తే.. రెండో డోసు వేసుకున్న తర్వాత తొమ్మిది నుంచి పన్నెండు నెలల వరకు సమయం ఉండాలని స్పష్టం చేస్తున్నారు.

అంటే.. ఈ ఏడాది జూన్ లో రెండో డోసు వేసుకొని ఉంటే.. మరీ తప్పదనుకుంటే మార్చి నుంచి మే మధ్యలో ఎప్పుడైనా వేసుకోవచ్చు. అయితే.. ఫలానా సమయానికే వేసుకోవాలి? అన్న దానిపై ఎవరూ స్పష్టమైన ప్రకటన చేస్తున్నది లేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. రెండో డోసుగా కోవిషీల్డ్ వేసుకుంటే బూస్టర్ డోస్ గా ఏ టీకాను వేసుకోవాలి? అదే సమయంలో కొవాగ్జిన్ రెండుడోసులు పూర్తి అయిన వారి పరిస్థితి ఏమిటి? మొదట్లో విపరీతమైన హైప్ క్రియేట్ అయిన రష్యాకు చెందిన స్పుత్నిక్ టీకా డోసులు రెండు పూర్తి చేసిన వారి సంగతేంటి? ఇలాంటి ప్రశ్నలు ఎన్నింటికో అధికారులు సమాధానం చెప్పాల్సిన ఉంది. ఏమైనా.. ప్రధాని మోడీ పుణ్యమా అని.. జనాల్లో బూస్టర్ డోసు కు సంబంధించిన చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది.


Tags:    

Similar News