త‌లుపులు మూసిన‌ప్పుడు... బీజేపీ ఉంది క‌దా!

Update: 2022-02-09 05:30 GMT
ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభ‌జ‌న‌కు సంబంధించి ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ పార్ల‌మెంటు వేదికగా.. కాంగ్రె స్‌పై విరుచుకు ప‌డిన విష‌యం తెల‌సిందే. పార్ల‌మెంటు త‌లుపులు మూసి.. మైకులు క‌ట్ చేసి.. పెప్ప‌ర్ స్ప్రే చేసి.. రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విభ‌జించార‌ని.. ప్ర‌ధాని తీవ్ర‌స్థాయిలో కాంగ్రెస్‌పై విరుచుకుప‌డ్డారు. కేంద్రంలో కాంగ్రెస్‌ను అధికారంలో కూర్చోబెట్టిన ఆంధ్రప్రదేశ్‌ పట్ల కాంగ్రెస్‌ వ్యవహరించాల్సిన తీరు ఇదేనా? ఇది ప్రజాస్వామ్యమా? అని మోడీ ప్రశ్నించారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తాము వ్యతిరేకించలేదని, కానీ.. ఏర్పాటు చేసే పద్ధతి అదేనా? అని నిలదీశా రు. అందరితో మాట్లాడి కలిసికట్టుగా రాష్ట్రాన్ని ఏర్పాటుచేసి ఉండవచ్చునని, కానీ.. అధికారంతో వచ్చిన అహంకారం తలకెక్కి క్రూరంగా వ్యవహరించారని ఆరోపించారు. క‌ట్ చేస్తే.. మోడీ మాట‌ల్లో విశ్వ‌స‌నీయత ఎంత‌?  ఆయ‌న చెప్పిన వ్యాఖ్య‌లు నిజ‌మేనా?  ఈ ప్ర‌పంచానికి తెలియ‌క‌పోవ‌చ్చేమో.. పార్ల‌మెంటు రికార్డుల‌కు.. చూసిన ప్ర‌జ‌ల‌కు కూడా ఆనాడు ఏం జ‌రిగిందో అంద‌రికీ తెలుసు!

దాచాలంటే.. దాగ‌దులే! అన్న‌ట్టుగా ఆనాడు రాష్ట్రాన్ని విభ‌జించాల్సిని ప‌రిస్థితి ఏర్పడిన‌ప్పుడు.. ఇటు పార్ల‌మెంటులో అయినా.. అటు రాజ్య‌స‌భ‌లో అయినా.. ఒక్క కాంగ్రెస్ మాత్రమే ఈ నిర్ణ‌యం తీసుకోలేదు. బీజేపీ కూడా మ‌ద్ద‌తు తెలిపింది క‌దా! చిన్న‌రాష్ట్రం.. చింత‌లేని రాష్ట్రం.. అంటూ.. బీజేపీ నాయ‌కులు.. వ్యాఖ్యానాలు చేశారు క‌దా!  దివంగ‌త కేంద్ర మంత్రి సుష్మా స్వ‌రాజ్ సైతం.. సుదీర్ఘ ప్ర‌సంగం చేసి.. తెలంగాణ ఇవ్వాల్సిందేన‌ని తేల్చి చెప్పారు క‌దా! ఇక‌, త‌ట‌స్థంగా ఉన్న‌.. నాటి రాజ్య‌స‌భ స‌భ్యులు.. ప్ర‌స్తుత ఉప రాష్ట్ర ప‌తి వెంక‌య్య‌నాయుడు కూడా.. ఏపీకి ప్ర‌త్యేక‌హోదా విష‌యంలో మాట్లాడ‌లేదా?

నాటి ప్ర‌ధాని మ‌న్మోహ‌న్‌సింగ్.. ప్ర‌త్యేక హోదాను ఐదేళ్ల‌పాటు ప‌రిమితం చేస్తామ‌ని అంటే.. కాదు ప‌దేళ్లు ఇవ్వాల‌ని.. ప‌ట్టుబ‌ట్టింది వెంక‌య్య కాదా?  తెలంగాణ రాష్ట్రాన్ని మీరు ఇవ్వ‌క‌పోయినా.. రేపు అధికారంలోకి వ‌చ్చాక మేమే ఇస్తామ‌ని.. సుష్మాస్వ‌రాజ్‌, అరుణ్ జైట్లీ వంటివారు మీడియా మీటింగుల వ‌ద్ద వ్యాఖ్యానించ లేదా?  కఇవ‌న్నీ.. మోడీ అర‌చేయి అడ్డు పెట్టినంత మాత్రం ప్ర‌పంచానికి క‌నిపించ‌కుండా పోతాయా?  వినిపించ‌కుండా ఉంటాయా?  

ఇప్పుడు ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల నేప‌థ్యంలో కాంగ్రెస్‌పై ఎక్క‌డ సింప‌తీ ప‌డుతుందో.. త‌మ హ‌వాకు ఎక్క‌డ ప్ర‌జ‌లు గండి కొడ‌తారో.. అనే ఉద్దేశంతో.. పురాతత్వ శాస్త్ర‌వేత్త‌లా.. పాత‌వి తొవ్వ‌డం.. పార్ల‌మెంటులో ఆనాడు ఏం జ‌రిగిందో.. త‌మ‌కు ఏమీ తెలియ‌ద‌ని అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించ‌డం.. మోడీ త‌న ద్వంద్వ ప్ర‌మాణాల‌ను బ‌య‌ట పెట్టుకున్నార‌ని అంటున్నారు నెటిజ‌న్లు.  


    

Tags:    

Similar News