రీజనల్ కోఆర్డినేటర్లుగా వైసీపీలో నియామకం అయిన వారంతా యాక్టివ్ గా ఉన్నారా? అన్న అనుమానాలు కేడర్ కు కలుగుతున్నాయి. మంత్రులుగా తప్పుకున్నాక చాలామంది ఇన్ ఛార్జులయ్యారు. వీరంతా క్షేత్ర స్థాయి వాస్తవాలు వైసీపీ అధిష్టానానికి వివరించేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదన్న వాదన కూడా ఉంది. ముఖ్యమంత్రి చెప్పిన విధంగా వైసీపీలో ఎవ్వరూ లేరు అన్నది తేలిపోయింది. అంటే ఆయన మాటకు కట్టుబడి, ఆయన విజన్ కు అనుగుణంగా, ఇంకా చెప్పాలంటే ఆయన భావజాలాన్ని జనంలోకి తీసుకుని వెళ్లే నాయకులు ఎవ్వరూ లేరు అని జగన్ భావిస్తున్నారట.
దీంతో వివిధ సర్వేలే కాదు క్షేత్ర స్థాయిలో పరిస్థితులు ఆయనకు అనుకూలంగానో, అనుగుణంగానో లేవట. రానున్న ఎన్నికల వరకూ వైసీపీ ఎమ్మెల్యేలు గడపగడపకూ కార్యక్రమాన్ని నిర్వహించినా, క్షేత్ర స్థాయి ఫలితాలలో పెద్ద మార్పు ఏమీ ఉండదంటున్నారు కొందరు వైసీపీ స్థానిక నేతలు. ఎందుకంటే స్థానిక సమస్యలు పరిష్కరించకుండా, వాటిపై ప్రజలు ఏం మాట్లాడుతున్నారో వినకుండా, ఓ వర్గం మీడియా అంటూ అక్కసు వెళ్లగక్కినంత కాలం వైసీపీకి సానుకూలం అయిన ఫలితాలు రావు అని విశ్లేషకులు అంటున్నారు.
ముఖ్యమంత్రిగా బాగా దగ్గర అనుకునే కొడాని నాని కానీ పేర్ని నాని కానీ జిల్లాలలో యాక్టివ్-గా లేరు అన్న విమర్శ వస్తోంది. ప్రతిపక్ష నేతలను అదే పనిగా తిట్టే క్రమంలో ఈ ఇద్దరు నేతలూ ముందుంటున్నారు. ఒకరు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడ్ని, మరొకరు పవన్ కల్యాణ్ ను తిట్టిపోస్తున్నారు.ఓ విధంగా ఈ విధంగా తిట్టడం కానీ తిట్టించడం కానీ గతంలోనూ ఉన్నా ఇంత ఘోరంగా హద్దులు దాటిన భాష అయితే ఏనాడూ లేదు.
ఆ రోజు నెల్లూరు కేంద్రంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అనే నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని విమర్శించినా ఇంత ఘోరంగా భాషను ఉపయోగించలేదు. ఇదే ఇప్పుడు జగన్ కు మైనస్ కానుంది. మైలేజీ తగ్గనుంది అని విశ్లేషకులు చెబుతున్నమాట. రీజనల్ కో ఆర్డినేటర్లుగా ఉన్న బొత్స కానీ ఇంకా ఇతర నాయకులు కానీ జిల్లా అధ్యక్షులు కానీ యాక్టివ్ - గాలేనే లేరు భావన కేడర్ లో ఉంది. ముఖ్యంగా అంతా వలంటీర్లే చేస్తున్నారు అన్న
ఆరోపణ కార్యకర్తల నుంచి వస్తుంది. వాస్తవం కూడా ఇదే. పార్టీ వలంటీర్ల చేతుల్లోకి వెళ్లిపోయింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే స్థానికంగా ఉన్న అసంతృప్తిని విపక్ష పార్టీలు తమకు అనుగుణంగా మలుచుకుంటున్నారట. బ్యాక్ ఎండ్ స్కీంల కారణంగా నాయకులకు సంబంధించి నేరుగా ఎవ్వరి పేరూ బయటకు రాదు దాంతో ఈ పథకాలు ఈ డబ్బులు ఇచ్చింది బ్యాంకర్లే అని అనుకుంటున్న తరుణాన వీటిపై అవగాహన కల్పించడంలో గ్రామాల్లోనే కాదు పట్టణాల్లో కూడా పెద్ద తలనొప్పిగా మారిందట.
ఎమ్మెల్యేలనూ, కొత్త మంత్రులనూ సమన్వయ పరిచి పనిచేయించాల్సిన రీజనల్ కోఆర్డినేటర్లు ఎవరి వ్యాపకాల్లో వారున్నారని ఆరోపణలు పార్టీ నుంచే వినిపిస్తున్నాయి. వివిధ సందర్భాల్లో వివిధ ప్రాంతాలకు చెందిన నేతలకు స్థానికంగా పట్టులేదు. వలంటీర్లపై అరిచి గోల చేయడం కన్నా తమ పరిధిలో తాము ప్రజల మనసు దోచుకుంటే, సమస్య లపై అవగాహన పెంచుకుంటే చాలు మంచి ఫలితాలే వస్తాయని అంటున్నారు. కానీ ఆ దిశగా ఎమ్మెల్యేలు, ఆ దిశగా రీజనల్ కో ఆర్డినేటర్లు, మంత్రులు పనిచేస్తున్న దాఖలాలే లేవు అని సోషల్ మీడియాలో బహిరంగ చర్చ జరుగుతోంది.