కేసీఆర్ ఎక్కడ తప్పు చేశాడు?

Update: 2022-12-29 05:32 GMT
ఎరక్కపోయి ఇరుకున్నట్లయింది ఇప్పుడు కేసీఆర్ పరిస్థితి. తెలంగాణలో రోజు రోజుకు పట్టు సాధిస్తున్న బీజేపీని దెబ్బ కొట్టడానికి కేసీఆర్ వేసిన ఎత్తులు ఆయననే బెడిసి కొట్టాయి. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసిందని ఆరోపించిన విషయంలో తాజాగా ఈడీ రంగ ప్రవేశం చేసింది. దీంతో ఇందులో అసలు నిజాలేమిటో ఈడీ తేల్చనుంది. అయితే ఇప్పటి వరకు బీజేపీ ఈ పని చేసి ఉంటే విచారణలో బయటపడేది. కానీ నిజం నిప్పులాంటిది.. ఏనాటికైనా నిజం నిజంగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో  ఇప్పుడు ఈడీ, సీబీఐలు దర్యాప్తులతో అసలు నిజం ఏంటో బయటపడే అవకాశం ఉంది. ఒకవేళ కేసీఆర్ ఇదంతా సృష్టించాడని తేలిస్తే మాత్రం ఆయన రాజకీయ భవిష్యత్ పై నీలినీడలు కమ్ముకునే ప్రమాదం ఉంది.

గతేడాది చివరిలో కేంద్రంపై యుద్ధం ప్రకటించిన తెలంగాణ సీఎం కేసీఆర్ బీజేపీపై పలు ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. వివిధ రాష్ట్రాల్లోని ఇతర ప్రభుత్వాలను పడగొట్టి బీజేపీ పాగా వేసిందన్నారు. మహారాష్ట్రలో శివసేన ప్రభుత్వాన్ని కూల్చి బీజేపీ జెండా ఎగరవేసిందన్నారు. అయితే ఇక్కడి విషయాన్ని పరిశీలిస్తే శివసేన అంతకుముందు సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసింది. ఆ సమయంలో శివసేన కంటే బీజేపీకే ఎక్కువ సీట్లు వచ్చాయి. కానీ శివసేన అత్యాశకు పడి కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో అదును చూసిన బీజేపీ ఆ రాష్ట్రాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకుంది.

ఇక కర్ణాటక విషయానికొస్తే ఇక్కడా బీజేపీ అధిక సీట్లు గెలుచుకుంది. కానీ తక్కువ సీట్లు వచ్చిన జేడీఎస్ కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తరువాత ఎక్కువ సీట్లు ఉన్న బీజేపీ తన బలం ప్రదర్శించి ఆ ప్రభుత్వాన్ని ఆధీనంలోకి తెచ్చుకుంది. ఇక గోవా విషయంలోనూ అదే జరిగింది. మరోవైపు ఇతర పార్టీల ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేస్తుందని ఆరోపిస్తున్నారు. కానీ ఏ ఎమ్మెల్యే అయినా రాజీనామా చేసిన తరువాత తమ పార్టీలోకి చేర్చుకుంటుంది. ఆ విషయం హుజూరాబాద్, మునుగోడు విషయంలో అర్థం చేసుకోవచ్చు.

ఈ విషయాలను పరిగణలోకి తీసుకొని కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా బీజేపీ కూలుస్తుందని ఆందోళన చెందుతున్నారు. ఇందులో భాగంగానే తమ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను 100 కోట్ల చొప్పున కొనుగోలు చేయడానికి ప్రయత్నించిదని అన్నారు. అందుకు ఈ వీడియోనే సాక్ష్యమని ఓ వీడియో ప్రసారం చేయించారు. అంతేకాకుండా సిట్ దర్యాప్తును ఆదేశించి నందకుమార్, రామతీర్థ, సింహయాజీ అనే వ్యక్తులను అరెస్టు చేయించారు.

కానీ ఇందులో అసలు నిజమెంత అని తెలుసుకోవడానికి కేంద్రం ఈడీని రంగంలోకి దించింది. ఆ తరువాత సీబీఐను ఆదేశించింది. అయితే రాష్ట్రంలో సీబీఐ దర్యాప్తును కేసీఆర్ అడ్డుకోవడంతో.. అరెస్టయిన నలుగురు కోర్టును సంప్రదించారు.  కోర్టు సీబీఐ విచారణకు అనుమతి ఇవ్వడంతో ఇప్పుడు కేసీఆర్ మెడకు ఈ కేసు చుట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సీబీఐ నందకుమార్ ను విచారించిన వాంగ్మూలం తీసుకున్నట్లు సమాచారం. మరింత లోతుగా విచారిస్తే అసలు విషయం బటయపడే అవకాశం ఉంది.

ఈనేపథ్యంలో కేసీఆర్ రాజకీయ భవిష్యత్ పై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఎప్పటికైనా నిజం నిజంలాగే ఉంటుందని కొందరు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గతంలో టీడీపీ హయాంలో ఎమ్మెల్సీని గెలిపించుకోవడానికి ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేసింది. ఆ విషయం రాజకీయంగా చూడొచ్చు. అది లీగల్ ఇస్యూ కాకపోవచ్చు. కానీ ఇప్పుడు ఎలాంటి ఆధారం లేకుండా బీజేపీ తమ ప్రభుత్వాన్ని కూలగొడుతుందని ఆరోపించడం ఆలోచనలేని పని అంటున్నారు. ఒకవేళ బీజేపీ టీఆర్ఎష్ ప్రభుత్వాన్ని కూలగొడితే ఆ సింపతి ద్వారా మళ్లీ కేసీఆర్ ప్రజల్లో సానుభూతి పొందవచ్చు గదా.. అని అనుకుంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News