లేపాక్షి ర‌చ్చ‌లో టీడీపీ ఎటు ?

Update: 2022-08-24 15:30 GMT
చాలా రోజుల‌కు టీడీపీకి గ‌ట్టిగా మాట్లాడేందుకు ఓ ఇష్యూ దొరికింది. ఆ విధంగా టీడీపీ ఏం చెప్పాల‌నుకుంటుందో కాస్త గ‌ట్టిగానే చెప్పేయొచ్చు. లేపాక్షి నాలెడ్జ్ హ‌బ్ కు అప్ప‌ట్లో కేటాయించిన భూములు తిరిగి ప్ర‌భుత్వం స్వాధీనం చేసుకోవాల‌ని ఆయ‌న ప‌ట్టుబ‌డుతున్నారు.

వీటిపై రెవెన్యూ శాఖామాత్యులు ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు స‌మాధానం చెప్పాల‌ని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఇప్పుడు వివాదం టీడీపీ మ‌రింత తీవ్ర‌త‌రం చేసింది. కానీ అచ్చెన్న లాంటి నాయ‌కులు కేవ‌లం మాట్లాడి వ‌దిలేయ‌కూడ‌దు అని, క‌మ్యూనిస్టుల‌తో క‌న్నెధార స్థాయిలో ఓ పోరాటం చేస్తే బాగుంటుంది అన్న అభిప్రాయం ఒక‌టి ఫ‌క్తు తెలుగుదేశం అభిమానుల నుంచి వ‌స్తోంది. టీడీపీకి ఇది మైలేజే !

వాస్త‌వానికి లేపాక్షి భూముల గురించి అచ్చెన్న ద‌గ్గ‌ర క‌న్నా ప‌య్యావుల కేశ‌వ్ ద‌గ్గ‌రే మంచి ఇన్ఫో ఉంది. వీళ్లిద్ద‌రూ కో ఆర్డినేట్ అయి పోరాటాలు చేస్తే బాగుంటుంది అన్న అభిప్రాయం కూడా కొన్ని సానుకూల వ‌ర్గాల నుంచి వ‌స్తున్న‌ది. ఇప్ప‌టికే ప‌ది వేల కోట్ల రూపాయ‌లు విలువ చేసే భూములు ఐదు వంద‌ల కోట్ల‌కే అమ్మేస్తున్నార‌న్న‌ది ఓ వార్త వెలుగు చూసింది క‌నుక భూముల విలువ ఎంత ? అందులో కంపెనీల వాటా ఎంత ? వీటిని అడ్డంపెట్టుకుని కంపెనీలు తీసుకున్న రుణాలు ఎంత అన్న‌వి ముంందు లెక్క తేలాలి అని సామాజిక‌వేత్త‌లు అంటున్నారు.

అస‌లు ఆ రోజు రాజ‌శేఖ‌ర్ రెడ్డి హ‌యాంలో జ‌రిగిన భూ కేటాయింపుల‌న్నింటినీ టీడీపీ హయంలో ర‌ద్దు చేస్తే బాగుండేది అన్న మాట కూడా వారే చెబుతున్నారు. ఇలాంటి మాట‌లేవో ఎఫ్బీలో వినిపిస్తున్నాయి. ఈ త‌రుణాన టీడీపీని మ‌రింత ముందుకు తీసుకుని వెళ్లే ప్ర‌జా ఉద్య‌మాలు మ‌రిన్ని రావాలి. చేయాలి అని అచ్చెన్న ను ఉద్దేశిస్తూ కొంద‌రు వ్యాఖ్యలు చేస్తున్నారు.
Tags:    

Similar News