ఆ కార్లు ఇక కనిపించవా.. కంపెనీ సంచలన నిర్ణయం

Update: 2019-04-27 01:30 GMT
కార్లు వాడకం గతంతో పోల్చితే బాగా పెరిగింది.. కొంత అందుబాటు ధరల్లోనూ కొన్ని కంపెనీలు కార్లను అమ్మకానికి పెట్టడం తో పాటు పలు బ్యాంకులు - ఇన్సూరెన్స్ కంపెనీల ఆకర్షణీయమైన వడ్డీ రేట్లతో కార్ లోన్లు ఇస్తుండటంతో ఎక్కువ మంది కార్ల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు.. ముఖ్యంగా మధ్యతరగతి కార్ల కొనుగోలు గణనీయంగా పెరిగాయి.. అయితే ముందు నుంచి కొన్ని కంపెనీలంటే కొందరితో ఓ అనుబంధంలా తయారైపోతాయి.. ఉదాహరణకు బజాజ్ స్కూటర్ ఉత్పత్తి ఆపేసినప్పుడు ఇదే చర్చ జరిగింది..

అయితే అలాంటిదే మరో వార్త వచ్చింది. ఇక నుంచి ఎక్కువ మంది భారతీయులు ఇష్టపడే మారుతి కార్లు ఇక కనిపించవు.. గాబరా పడకండి కేవలం డీజిల్ వేరియంట్ కార్లు మాత్రమే కనిపించవు... వచ్చే ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి డీజిల్‌ కార్లను విక్రయించబోమని అతిపెద్ద కారు తయారీ కంపెనీ మారుతి సుజుకి ఇండియా స్పష్టం చేసింది. ప్రజల నుంచి డిమాండ్‌ భారీగా పడిపోవడంతో తాము 2020 - ఏప్రిల్‌ 1 నుంచి డీజిల్‌ కార్ల అమ్మకాన్ని చేపట్టడంలేదని మారుతి సుజుకి చైర్మన్‌ ఆర్‌సీ భార్గవ పేర్కొన్నారు. కాగా 1500 సీసీ పైబడిన డీజిల్‌ కార్లను మాత్రం విక్రయించేందుకు కంపెనీ మొగ్గుచూపుతోంది. మారుతి ఇటీవల లాంఛ్‌ చేసిన బాలెనో ఇదే కేటగిరీకి చెందిన వాహనం.

గతంలో పెట్రోల్ ధరకి - డిజీల్ ధరకి చాలా వ్యత్యాసం ఉండేది. డిజీల్ ధర చాలా తక్కువుగా ఉండటంతో ఎక్కువ మంది డిజీల్ వేరియంట్ వాహనాల కొనుగొలుకు వినియోగదారులు మొగ్గు చూపేవారు. అయితే ఈ మధ్య కాలంలో పెట్రోల్ కు సమానంగా డిజీల్ ధరలు పెరగడంతో డిజీల్ వేరియంట్ కార్ల కొనుగోలు మందగించింది.. అందులోనూ పెట్రోల్ కార్లతో పోల్చితే డిజీల్ కార్ల మెయింటెనన్స్ ఖర్చు కూడా ఎక్కువే.. దీంతో మారుతి తో పాటు మరికొన్ని కంపెనీలు కూడా ఇదే బాట పట్టబోతున్నాయంటున్నారు. 

కేవలం 1500 సీసీ డీజిల్‌ వాహనానికే భవిష్యత్‌ ఉందని, బీఎస్‌ 5 ప్రమాణాలు అమల్లోకి వస్తే 1500 సీసీ లోపు డీజిల్‌ ఇంజన్‌లకు ఆదరణ ఉండదని మారుతి భావిస్తోంది. బీఎస్‌ 4 వాహనాల విక్రయం, రిజిస్ర్టేషన్‌కు 2020 మార్చి 31ని డెడ్‌లైన్‌గా ప్రభుత్వం నిర్ధారించిన సంగతి తెలిసిందే. బీఎస్‌ 6 ప్రమాణాలతో కూడిన వాహనాలకు గిరాకీ పెరుగుతుందని తదనుగుణంగా తమతో పాటు డీలర్లు సమిష్టిగా పనిచేసి ధరలు నిలకడగా ఉండేందుకు పూనుకోవాలని అన్నారు. గడువులోగా తాము తమ 16 మోడళ్లను అప్‌డేట్‌ చేస్తామని ఆయన చెప్పుకొచ్చారు. మరో వైపు ఎన్నికలు, తాజాగా ఇరాన్ నుంచి చమురు దిగుమతి చేసుకొనే దేశాలపై అమెరికా ఆంక్షలు ఇలా పెట్రోలు ధరలు భారీగా పెరగబోతున్నాయనే వార్తలూ వినియోగదారుల్లో కార్ల కొనుగోలుపై అనాసక్తికి కలిగించవచ్చని నిపుణులంటున్నారు.

   

Tags:    

Similar News