వైట్ ఫంగస్ .. బ్లాక్‌ ఫంగస్‌ కంటే యమా డేంజర్‌ !

Update: 2021-05-21 13:30 GMT
మనదేశం  కరోనా సెకండ్ వేవ్  ఉద్ధృతితో అల్లాడుతుండగానే ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్ల ముప్పు భయపెడుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో బ్లాక్‌ ఫంగస్‌ కేసులు, మరణాలు చోటుచేసుకుంటుండగా కొత్తగా వైట్‌ ఫంగస్‌ వెలుగులోకి రావడం కలవరానికి గురిచేస్తోంది.

బిహార్‌ లో నాలుగువైట్ ఫంగస్ కేసులు బయటపడ్డాయి. పట్నా మెడికల్ కాలేజీలో నలుగురిలో వైట్‌ ఫంగస్‌ గుర్తించారు. వీరిలో ఓ డాక్టర్‌ ఉండడం గమనార్హం. కరోనా వైరస్ నుంచి కోలుకున్న వారిలో రోగనిరోధకత తక్కువగా ఉన్నవారు, మధుమేహులు, చికిత్సలో స్టెరాయిడ్లు వాడిన వారికి బ్లాక్‌ ఫంగస్‌ సోకుతోంది. వైట్‌ ఫంగస్‌ అలా కాదు. కరోనాతో ఏమాత్రం సంబంధం లేకుండా వ్యాప్తిచెందుతోంది. ఇది బ్లాక్‌ ఫంగస్‌ కంటే ప్రమాదకరమైనది.

బిహార్‌ కేసుల్లో . వైట్‌ పంగస్‌ సోకినవారిలో కరోనా లేదు. వారికి ఆర్టీపీసీఆర్‌ పరీక్షలో నెగటివ్‌ రిపోర్టు వచ్చింది. కానీ, సీటీస్కాన్‌ లో వైట్‌ ఫంగస్‌ ఆనవాళ్లను గుర్తించామని పట్నా మెడికల్‌ కాలేజీ మైక్రో బయాలజీ చీఫ్‌ డాక్టర్‌ ఎస్‌.ఎన్‌.సింగ్‌ తెలిపారు. కరోనా మాదిరిగానే  వైట్‌ ఫంగస్‌ కూడా ఊపిరితిత్తులను దెబ్బతీస్తుందని డాక్టర్‌ ఎస్‌.ఎన్‌.సింగ్‌ చెప్పారు. బ్లాక్‌ ఫంగస్‌ ముఖ భాగాన్ని దెబ్బతీస్తుందని, ముక్కు ద్వారా కళ్లకు, మెదడుకు ఇన్ఫెక్షన్‌ అవుతుందని, వైట్‌ ఫంగస్‌ అలా కాదని చెప్పారు. ఎక్స్‌రే, సీటీస్కాన్‌ ద్వారా వైట్‌ ఫంగస్‌ ను గుర్తించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. పట్నాలోని నలుగురు బాధితులు చికిత్సతో కోలుకున్నారని డాక్టర్‌ ఎస్‌.ఎన్‌.సింగ్‌ చెప్పారు. వైట్‌ ఫంగస్‌ సోకిన వారికి సకాలంలో చికిత్స అందిస్తే ప్రాణాపాయం నుంచి తప్పించవచ్చు. ఇందుకోసం యాంటీ-ఫంగల్‌ ఔషధాలను ఇవ్వాల్సి ఉంటుంది అని తెలిపారు.

రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, దీర్ఘకాలికంగా స్టెరాయిడ్స్‌ తీసుకుంటున్న వారు, మధుమేహ వ్యాధిగ్రస్థులు, హెచ్‌ ఐవీ ,ఎయిడ్స్‌, మూత్రపిండాల మార్పిడి చేయించుకున్న వారికి వైట్‌ ఫంగస్‌ తో ముప్పు ఎక్కువగా ఉంటుంది. కొవిడ్‌ రోగులకు కూడా ఈ ముప్పు ఉంటుందని డాక్టర్‌ ఎస్‌.ఎన్‌.సింగ్‌ వివరించారు. బ్లాక్‌ ఫంగస్‌ సోకిన మాదిరిగానే రోగనిరోధకశక్తి తక్కువ ఉన్నవారికి ఎక్కువగా సోకే అవకాశం ఉందని, డయాబెటిస్‌, స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడటం వల్ల వైట్‌ ఫంగస్‌ సోకే అవకాశం ఉందని చెబుతున్నారు. వైట్ ఫంగస్ రోగుల ఊపిరితిత్తులను నేరుగా ప్రభావితం చేస్తుంది. వైద్యులు ప్రకారం.. క్యాన్సర్ రోగులు వైట్ ఫంగస్‌ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వైట్ ఫంగస్ పిల్లలు, మహిళలకు కూడా సోకుతుంది. ఇది ల్యూకోరోయాకు ప్రధాన కారణం.
Tags:    

Similar News