అమెరికా : చరిత్రలో ఏ రోజూ నిజాలు వెల్లడించలేదు !

Update: 2020-10-06 02:30 GMT
అమెరికా .. ప్రపంచంలోనే అగ్రదేశంగా విరాజిల్లుతుంది. అమెరికాలో ప్రస్తుతం ఎన్నికల కోలాహలం నడుస్తుంది. ఈ ఎన్నికల్లో మళ్లీ గెలిచి మరోసారి అధ్యక్షుడిగా వైట్ హౌస్ లో అడుగుపెట్టాలని ఆలోచిస్తున్నాడు. అలాగే జో బైడెన్ కూడా ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే కసితో ప్రచారంలో పాల్గొంటున్నారు. అయితే తాజాగా ట్రంప్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి భారిన పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైట్ హౌస్ గురించి మరో వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. అదేమిటంటే .. చరిత్రలో ఏ అధ్యక్షుడి అనారోగ్యం పై సరైన సమాచారం వెల్లడించలేదు.

తాజాగా ట్రంప్‌ విషయంలోనూ అదే జరుగుతోంది. ఆయనకు కొవిడ్‌కు సోకిందన్న విషయమే ఆలస్యంగా నాలుగు రోజుల తరువాత బయటపెట్టారు. ఆ తరువాత కూడా ఆయనకు ఏఏ మందులిస్తున్నారు, పరిస్థితేంటి, శరీరంలో మిగిలిన భాగాలు ఎలా పనిచేస్తున్నాయి, ఆక్సిజన్‌ లెవల్స్‌ ఎలా ఉన్నాయన్నది, డాక్టర్లు బయటపెట్టలేదు. గతంలోనూ ఇలాంటివి చాలానే జరిగాయి. కొన్ని రాజకీయ కారణాలైతే మరికొన్ని దేశ భద్రత, ఆర్థిక స్థితి దిగజారకూడదన్న నిర్ణయాలు. కొందరు అధ్యక్షులు వ్యక్తిగతంగా కూడా తమ అనారోగ్యాన్ని బయటపెట్టనివ్వలేదు. అతి గోప్యత పాటించిన కొందరు అధ్యక్షుల వివరాలని చూస్తే ..

1944లో ఫ్రాంక్లిన్‌ రూజ్‌వెల్ట్‌ బీపీ, గుండె జబ్బు, జీర్ణ, శ్వాసకోశ ఇబ్బందులతో బాధపడుతున్న విషయాన్ని ఎన్నికల కారణంగా బయటపెట్టలేదు. ఎన్నికలు పూర్తయి ఎన్నికయాక కొద్ది కాలానికే 1945 ఏప్రిల్‌లో గుండెపోటుతో మరణించారు.

1919లో ప్రపంచ యుద్ధం ముగిశాక పారిస్ లో చర్చలు జరుపుతున్న సమయంలో వుడ్రో విల్సన్‌ కుప్పకూలారు. ఆయనకు అంతకు కొన్నేళ్ల ముందే స్పానిష్‌ ఫ్లూ సోకినట్లు, దాని తదనంతర సమస్యల వల్లే మరణించినట్లు తరువాత తేలింది.

1967లో లిండన్‌ జాన్సన్‌ రహస్యంగా తన చర్మానికున్న ఓ గాయాన్ని తొలగించుకున్నారు. చనిపోయాక గానీ ఆ విషయం బయటపడలేదు.

1963లో జాన్‌ ఎఫ్‌ కెనెడీ ఎడిసన్‌ వ్యాధితో బాధపడేవారు. కానీ ఎన్నడూ దాన్ని బయటపెట్టలేదు. ఆ వ్యాధి ముదిరినప్పుడు కూడా శ్వేతసౌధం వెల్లడించలేదు. అయితే ఆయన హత్యకు గురవడం వల్ల ఈ వ్యాధి విషయం మరుగునపడింది.

1955లో ఐసెన్‌హోవర్‌ ఓసారి విహారయాత్రలో ఉండగా గుండెపోటు వచ్చింది. ఆయన దాన్నుంచి కోలుకున్నారు గానీ ఆ విషయాన్ని మాత్రం డాక్టర్లు బయటపెట్టలేదు.

1841లో విలియం హారిసన్‌, 1890లో గ్రోవర్‌ క్లీవ్‌లాండ్‌ కూడా తమ అనారోగ్యాలను, చికిత్సలను దాచిపెట్టినవారే.
Tags:    

Similar News