అమెరికాకు వలస వస్తున్న వారికి వ్యతిరేకంగా కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలే కాన్సస్ లో భారతీయ ఇంజినీర్ పై దాడికి దారితీశాయన్న ఆరోపణలను ట్రంప్ ప్రభుత్వం తిరస్కరించింది. ట్రంప్ విధానాలకు ఇంజినీర్ హత్యకు కారణమైన కాల్పుల ఘటనకు ముడిపెట్టడం అసంగతమని అధ్యక్ష భవనం వైట్ హౌస్ పత్రికా కార్యదర్శి సీన్ స్పియర్ విలేకరులతో అన్నారు. "జరిగింది విషాద ఘటనే. ఎవరి ప్రాణం పోయినా అది విషాదంగానే భావిస్తాం. కానీ ఆ ఘటనకు ట్రంప్ విధానాలకు సంబంధం లేదు" అని అన్నారు.
కాన్సస్ లోని బార్ వద్ద ఒక శ్వేత జాతీయుడు తుపాకీతో జరిపిన కాల్పుల్లో శ్రీనివాస్ కూచిభొట్ల (32) అనే భారతీయ ఇంజినీర్ చనిపోగా, మరో ఇద్దరు గాయపడిన సంగతి తెలిసిందే. ఇతర దేశాల వారిని అమెరికాలోకి అడుగపెట్టనీయరాదని ట్రంప్ ప్రకటనలు చేస్తున్నపటి నుంచి అమెరికాలో ఉన్న ఇతర దేశాల వారిపై దాడులు పెరుగుతున్నాయని పలువురు భావిస్తున్నారు. శ్రీనివాస్ హత్యోదంతంపై విచారణను త్వరగా జరిపించాలని భారత దౌత్య కార్యాలయం ఒక లేఖ ద్వారా అమెరికాను కోరింది. శ్రీనివాస్ మృతదేహాన్ని ఇండియాకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు భారత దౌత్యకార్యాలయ ప్రతినిధి పాట్రిక్ మాథుర్ చెప్పారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/