భారతీయుల కోర్కెకు నో చెప్పిన వైట్ హౌస్

Update: 2016-10-04 11:39 GMT
ఉరీ ఉగ్రఘటన అనంతరం పాక్ తీరుపై భారతీయులు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న తీరు తెలిసిందే. ఇప్పటివరకూ పాక్ తో చర్చలు జరపాలని చెప్పే వారు సైతం.. అందుకు భిన్నంగా పాక్ తాట తీయాలని.. యుద్ధమైనా చేసేయాలంటూ వ్యాఖ్యలు చేయటం. .ఇలాంటి స్టేట్ మెంట్లు ఇచ్చే వారిలో సెలబ్రిటీలు ఉండటం  తెలిసిందే. ఇదిలా ఉంటే.. పాక్ మీద ఒత్తిడి పెంచేందుకు..పాక్ ను అంతర్జాతీయంగా ఏకాకిని చేసేందుకు ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇందులో భాగంగా పాక్ ను ఉగ్రవాద పెట్టుబడిదారీ దేశంలో ప్రకటించాలంటూ ఇండో అమెరికన్లు వైట్ హైస్ లో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై జోరుగా సంతకాల కార్యక్రమం జరుగుతోంది. ఈ పిటీషన్ ప్రత్యేకత ఏమిటంటే..నిబంధనలకు అనుగుణంగా ఈ పిటిషన్ కు రావాల్సిన సంతకాలు వచ్చిన  తర్వాత అధికారికంగా అమెరికా ఈ అంశంపై స్సందించి.. తామేం చేయనున్నామన్న విషయాన్ని చెప్పాల్సిందే.

ఈ పిటిషన్ కు రావాల్సిన సంతకాల కంటే 6.25 లక్షల సంతకాలు ఎక్కువ రావటం.. ఈ సంతకాల్లో కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నట్లుగా వైట్ హౌస్ గుర్తించింది. దీంతో.. అనుమానాస్పద సంతకాలున్న ఈ పిటీషన్ ను తొలగిస్తూ వైట్ హౌస్ నిర్ణయం తీసుకుంది. దీంతో..పిటిషన్ తో పాక్ పై ఒత్తిడి పెంచే ఒక అవకాశం మిస్ అయినట్లే. ఇదిలా ఉంటే.. పాక్ మీద ఎలా అయితే ఒత్తిడి తీసుకురావాలన్న ప్రయత్నం జరిగిందో.. తాజాగా భారత్ పై ఇలాంటి ప్రయత్నాన్నిపాకిస్థానీయులు షురూ చేయటం గమనార్హం. మరి.. వారి పిటిషన్ పై వైట్ హౌస్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News