కమలా హ్యారిస్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అమెరికా తొలి ఉపాధ్యక్షురాలిగా ఉన్న ఆమె మేనకోడలు ఇప్పుడు వార్తల్లో వ్యక్తిగా మారారు. వైట్ హౌస్ సంప్రదాయాల్ని.. పద్దతుల్ని పట్టించుకోకుండా.. మేనత్తకు ఉన్న ఇమేజ్ తో తన బ్రాండ్ ను పెంచుకోవటానికి ఆమె చేస్తున్న ప్రయత్నాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయినప్పటికీ.. ఆమె ఆ విషయాల్నిఅస్సలు పట్టించుకోవటం లేదు. దీంతో.. వైట్ హౌస్ రంగంలోకి దిగి.. తాజాగా వార్నింగ్ ఇచ్చే వరకు వెళ్లింది.
ఇంతకీ కమలా హ్యారిస్ మేనకోడలు మీనా హారీస్ చేస్తున్న అతి ఏమిటన్నది చూస్తే.. న్యాయవాదిగా ఉంటూ వ్యాపారవేత్తగా మారిన విలక్షణత మీనా సొంతం. పుస్తకాలు రాయటం..తన మేనత్త పలుకుబడిని దుర్వినియోగం చేయదు కానీ.. ఆమె పేరును తరచూ వాడేస్తుంటుంది. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఆమె.. తరచూ తనకు సంబంధించిన వీడియోల్ని పోస్టు చేస్తూ ఉంటారు. ఆమె ఇన్ స్టా అకౌంట్లో ఎనిమిది లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారు. తన గురించి ప్రస్తావించే ప్రతిసారీ తన మేనత్త గురించి చెప్పటం ద్వారా.. తాను ఎవరు? అన్న విషయాన్ని ఆమె చెప్పకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు.
ఇలా అమెరికా ఉపాధ్యక్షురాలి పేరును వ్యక్తిగత బ్రాండ్ఇమేజ్ పెంచుకోవటం సరికాదని మీనాను వైట్ హౌస్ హెచ్చరించింది. ఇలాంటి ప్రచారం వైట్ హౌస్ నైతిక సంప్రదాయాలకు లోబడి లేదని వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల బైడెన్ డోనార్ ఒకరితో కలిసి ఆమె ఒక ప్రైవేట్ విమానంలో విహరించారు. దీనికి సంబంధించిన వీడియోను ఆమె పోస్టు చేశారు. తన సోషల్ మీడియా ఖాతాలో వ్యక్తిగత అంశాలే కాదు..రాజకీయ అంశాలకు సంబంధించిన వాటిని పోస్టు చేస్తుంటారు.
కమలా అండ్ మాయాస్ బిగ్ ఐడియాతో సహా పలు చిన్నారుల పుస్తకాల్ని ప్రచురించిన ఆమెకు ఫెనామినల్ పేరుతో మహిళల ఛారిటబుల్ దుస్తుల బ్రాండ్ కూడా ఉంది. మేనత్త అమెరికా ఉపాధ్యక్షురాలిగా ప్రమాణస్వీకారం చేయటానికి రోజు ముందు.. తన తాజా పుస్తకం యాంబీషియస్ గర్ల్ అన్న బుక్ ను విడుదల చేశారు.