పంజాబ్ లో రాజకీయ తేనెతుట్టెను కదిపింది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్. అమరీందర్ సింగ్ ను అనూహ్యంగా రాజీనామా చేయించి కాంగ్రెస్ హై కమాండ్ కాక రేపింది. అమరీందర్ ఆ విషయంలో మొదట్లో నెమ్మదిగానే కనిపించారు. ఆ తర్వాత ఈ రాజకీయ కురువృద్ధుడు వేగంగా అడుగులు వేస్తూ ఉన్నాడు. అదే అనుకుంటే.. మరోవైపు కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాంగ్రెస్ కు మరో సవాల్ గా మారింది.
అధిష్టానానికి చెప్పి, చెప్పీ.. అమరీందర్ నే ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించిన ఆత్మవిశ్వాసంతో సిద్ధూ మరింత రెచ్చిపోయాడు. కొత్త ప్రభుత్వంలో ఎవరికి ఏ శాఖలు, ఎవరు మంత్రులుగా ఉండాలనేదంతా తన ఇష్టప్రకారమే జరగాలన్నట్టుగా సిద్ధూ రెచ్చిపోతున్నాడు. సాధారణంగా కేబినెట్ అనేది ముఖ్యమంత్రికి సంబంధించిన అంశమే. అయితే సిద్ధూ మాత్రం అంతా తను చెప్పినట్టుగా ఉండాలంటున్నాడు.
ఇదే సమయంలో తన సీఎం సీటు ఆశలకు నీళ్లు వచ్చినట్టుగా కూడా సిద్ధూ భావిస్తున్నాడు. అందుకే రచ్చ తీవ్రంగా చేస్తున్నాడనేది ఓపెన్ సీక్రెట్ గా మారింది.
ఇక అమరీందర్ ఢిల్లీ చేరుకుని అక్కడ వరస సమావేశాలు నిర్వహిస్తున్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, ఆ తర్వాత అజిత్ ధోవల్ లతో సమావేశం అయిన అమరీందర్ తదుపరి సమావేశాన్ని ఎవరితో నిర్వహిస్తారనేది హాట్ టాపిక్ గా మారింది.
ఇక సిద్ధూ కూడా ట్వీటేశారు. ముక్యమంత్రి చన్నీతో చర్చలకు సిద్ధమని, ఈ రోజే చర్చలని సిద్ధూ ప్రకటించాడు. అయినా ముఖ్యమంత్రితో ఆల్రెడీ పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సిద్ధూ చర్చలు జరపడం ఏమిటి? సిద్ధూ ఎంత గ్లామరస్ పొలిటీషియన్ అయినా కేబినెట్ కూర్పులో ముఖ్యమంత్రితో చర్చించేది ఏముంటుంది? ఒకవేళ సిద్ధూ ఏదైనా చెప్పాలనుకుంటే అధిష్టానానికి చెప్పొచ్చు.
అయితే హద్దు మీరిన సిద్ధూ.. కాంగ్రెస్ వీక్ నెస్ లను అడ్డం పెట్టుకుని ఆడుకుంటున్నట్టుగా ఉన్నాడు. అమరీందర్ వంటి బలమైన నేతతోనే రాజీనామా చేయించిన కాంగ్రెస్ హైకమాండ్, కొత్త దళిత సీఎంకు మాత్రం పూర్తి ఫ్రీడమ్ ఇచ్చే సాహసం చేస్తున్నట్టుగా లేదు. అదే ఇక్కడ కాంగ్రెస్ వీక్ నెస్ గా కనిపిస్తోంది.