భారత స్వాతంత్ర ఉద్యమంలో ఉప్పు సత్యాగ్రహం ఓ కీలకఘట్టం.. దీన్ని దండి యాత్రగాను.. సహాయనిరాకరణోద్యమంగానూ పిలుస్తారు. మహాత్మా గాంధీ దండియాత్ర పేరుతో బ్రిటిష్ పాలకులపై దండయాత్ర చేశారు. అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఉప్పు తయారీపై పన్ను విధించడాన్ని నిరసిస్తూ మహాత్ముడు ఈ పిలుపునిచ్చారు. అయితే దేశ వ్యాప్తంగా ఈ ఉద్యమంపై రాజుకున్నది. అనేక చోట్ల ప్రజలు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించారు. మహాత్ముడి పిలుపుతో తెలుగు బిడ్డలు కూడా కదిలారు. 1930 మార్చి 12న మహాత్మా గాంధీ 'దండి మార్చ్'కు పిలుపు నిచ్చారు. అంటే నేటికి సరిగ్గా 90 ఏళ్లు. అయితే ఈ ఉద్యమంలో పాల్గొన్న తెలుగు వారెవరు.. గాంధీ పిలుపుతో తెలుగు ప్రజలు ఎలా స్పందించారో? ఇప్పుడు తెలుసుకుందాం..
ఆరోజు మహాత్మాగాంధీ సబర్మతీ ఆశ్రమం నుంచి దండి వరకు ర్యాలీగా తరలివెళ్లారు. అనంతరం అక్కడ బ్రిటిష్ ప్రభుత్వం చట్టాలను ఉల్లంఘిస్తూ ఉప్పును తయారుచేశారు.
గాంధీ పిలుపుతో దేశమంతా ఈ ఉద్యమం పాకింది. అన్ని చోట్ల గాంధేయవాదులు, కాంగ్రెస్ నేతలు, స్వాతంత్ర్య ఉద్యమకారులు ఈ పోరాటంలో పాలుపంచుకొన్నారు.
మహాత్ముడు తన 78 మంది అనురులతో కలిసి దండికి వెళ్లారు. అయితే మహాత్ముడి వెంట నడిచిన తెలుగు వ్యక్తి
ఎర్నేని సుబ్రహ్మణ్యం . ఆ తర్వాత ఆయన ఓ ఆశ్రమాన్ని కూడా స్థాపించారు.
ఉప్పు సత్యాగ్రహం నెల్లూరులోనూ సాగింది. ఇక్కడి ఉద్యమానికి దండు నారాయణరాజు నేతృత్వం వహించారు. ఆయనను అప్పటి ప్రభుత్వం అరెస్ట్ చేసింది. అయితే నారాయణరాజు జైళ్లోనే కన్నుమూశారు.
టంగుటూరి ప్రకాశం పంతులు మద్రాసులోని సత్యాగ్రహ కేంద్రాలను ఏర్పాటు చేశారు. విశాఖపట్నంలో తెన్నేటి విశ్వనాథం, మచిలీపట్నంలో అయ్యదేవర కాళేశ్వరరావు, రాయల సీమ పరిధిలో కల్లూరి సుబ్బారావు ఉప్పు సత్యాగ్రహానికి నాయకత్వం వహించారు. నెల్లూరులోని మైపాడు బీచ్‌లో బెజవాడ గోపాలరెడ్డి ఉప్పు తయారుచేశారు.
ఉప్పు సత్యాగ్రహం టైంలోనే తెలుగునాట పలు కీలకఘటనలు చోటుచేసుకున్నాయి.
ప్రముఖ కవి, నాస్తికుడు త్రిపురనేని రామస్వామి చౌదరి ''వీర గంధము తెచ్చినారము వీరులెవ్వరొ తెల్పుడి'' అనే గ్రంథాన్ని రచించారు.
ప్రపంచ ప్రఖ్యాత నవల 'ది మదర్'ను 'అమ్మ' పేరుతో క్రొవ్విడి లింగరాజు తెలుగోలోకి అనువదించారు.
బ్రహ్మాజోశ్యుల సుబ్రహ్మణ్యం సీతానగర ఆశ్రమాన్ని స్థాపించారు. దీన్నే 'ఆంధ్రా దండి'గా పిలుస్తారు.