యావత్తు ప్రపంచ దేశాలను హడలెత్తిస్తున్న కరోనా వైరస్ కారణంగా మిగిలిన వారి పరిస్థితి ఎలా ఉన్నా... ఇప్పటికే హెచ్ఐవీ సోకి చికిత్స తీసుకుంటున్న ఎయిడ్స్ రోగుల ప్రాణాలకే పెను ప్రమాదం తలెత్తనుందన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. కరోనా కట్టడి కోసం ఇప్పటికే అమలులో ఉన్న లాక్ డౌన్ తరహా పరిస్థితులు మరింత కాలం పాటు కొనసాగితే... ఏకంగా 5 లక్షల మంది ఎయిడ్స్ రోగులు మరణించే ప్రమాదం లేకపోలేదంట. ఈ మేరకు ఐక్యరాజ్య సమితి ఆరోగ్య విభాగం ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ), యూఎన్ ఎయిడ్స్ సంస్థలు సంచలన ప్రకటనను విడుదల చేశాయి. కరోనా సంక్షోభం నేపథ్యంలో హెచ్‌ఐవీ రోగులకు సరైన వైద్య సదుపాయాలు అందకపోతే ఎయిడ్స్‌తో మరణించే వారి సంఖ్య రెట్టింపు అవుతుందని ఆ సంస్థలు తమ ప్రకటనలో వెల్లడించాయి. సహారా ఆఫ్రికా ఉప ప్రాంతంలో ఈ పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని ఆ సంస్థలు పేర్కొన్నాయి.
‘‘కరోనా వైరస్ వ్యాప్తి వల్ల యాంటీవైరల్ థెరపీకి అంతరాయం కలిగిన కారణంగా 2020-21 నాటికి సహారా ఆఫ్రికా ప్రాంతంలో 5 లక్షలకు మించి మరణాలు సంభవించే అవకాశం ఉంది’’ డబ్ల్యూహెచ్‌ఓ, యూఎన్‌ఎయిడ్స్ ఓ ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. ప్రస్తుతం కరోనా వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌తో హెచ్‌ఐవీ రోగులకు అందించే సేవలు, మందుల సరఫరాకు అంతరాయం కలిగిందని ఆ సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే 2008 నాటి చేదు అనుభవాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించాయి. ఆ ఏడాది దాదాపు 9,50,000కు పైగా ఎయిడ్స్ పేషెంట్లు మృత్యువాత పడిన విషయాన్ని ఆ సంస్థలు గుర్తు చేశాయి. ‘‘ఎయిడ్స్ సంబంధిత వ్యాధులతో ఆఫ్రికాలో ఐదు లక్షలకు పైగా మరణాలు సంభవించే అవకాశం ఉంది. చరిత్ర పునరావృతం అవుతుంది. మళ్లీ తిరోగమనం’’ అని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ ఆధనోమ్ గాబ్రియేసస్ హెచ్చరించారు.
కరోనా ప్రభావం ఉన్నప్పటికీ ఇప్పటికే కొన్ని దేశాలు హెచ్‌ఐవీ రోగులకు సెల్ఫ్ టెస్టింగ్ కిట్లు అందేలా చర్యలు తీసుకుంటున్నాయని.. వాటిని అనుసరించాలని ఆఫ్రికా దేశాలకు గాబ్రియేసన్ విజ్ఞప్తి చేశారు. కాగా 2018 నాటి గణాంకాల ప్రకారం సబ్- సహారా ఆఫ్రికా ప్రాంతంలో దాదాపు 25.7 మిలియన్ మందికి హెచ్‌ఐవీ సోకినట్లు అంచనా. అందులో 16.4 మిలియన్ మందికి యాంటీవైరల్ థెరపీ నిరంతయరాయంగా కొనసాగాల్సి ఉంది. లేనట్లయితే వారి ప్రాణాలకే ప్రమాదం. ఈ నేపథ్యంలో అనవసర మరణాలు అరికట్టాలని, యాంటీవైరల్ థెరపీ ప్రారంభించాలని డబ్ల్యూహెచ్‌ఓ, యూఎన్ఎయిడ్స్ విజ్ఞప్తి చేశాయి. మొత్తంగా కరోనా కారణంగా ఇతరుల పరిస్థితి ఎలా ఉన్నా... ఎయిడ్స్ రోగుల పరిస్థితి మాత్రం ప్రమాదంలో పడినట్టేనన్న మాట తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది.