డ్రగ్ పార్టీకి వెళ్లిన ఎమ్మెల్యేలు ఎవరు? క్రాస్ చెక్ మొదలెట్టిన టీసర్కార్
గడిచిన నాలుగైదు రోజులుగా సంచలనంగా మారిన కన్నడ డ్రగ్ పార్టీ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కన్నడ సినీ రంగానికి చెందిన వ్యక్తి ఒకరు కన్నడ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడి హోటల్లో ఏర్పాటు చేసిన పార్టీలో డ్రగ్ష్ వినియోగం జరిగినట్లుగా తేలటం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ పార్టీకి హాజరైన వారెవరు? అన్న ప్రశ్నకు సమాధానం వెతికే క్రమంలో.. అతిధుల జాబితాలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు (నలుగురు అన్న ప్రచారం కూడా సాగుతోంది) ఉన్నారని.. వారు ఆ పార్టీకి వెళ్లినట్లుగా జోరు ప్రచారం సాగుతోంది.
తెలుగు మీడియాలో వారి పేర్లు ప్రస్తావించనప్పటికీ.. వాట్సాప్ గ్రూపుల్లో మాత్రం ప్రైవేటుగా వారి పేర్లు వైరల్ అయ్యాయి. అయితే.. అలా ప్రచారం సాగుతున్న పేర్లలో ఒకట్రెండు పేర్లు తప్పని.. దాని స్థానంలో మరో ఇద్దరి పేర్లు యాడ్ కావాలన్న మాట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. ఆ డ్రగ్స్ కేసు వ్యవహారంలో నిజానిజాల మాటేమిటి? అన్న విషయాన్ని క్రాస్ చెక్ చేసే ఆలోచనలోకి తెలంగాణ సీఎం కేసీఆర్ డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది.
ముగ్గురు.. నలుగురు ఎమ్మెల్యేలు పార్టీకి వెళ్లినట్లుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. వారెవరు? అన్న ప్రశ్నకు సమాధానాలు ఇవ్వాల్సిందిగాఆదేశించినట్లు చెబుతున్నారు. ప్రతి ఎమ్మెల్యే వ్యక్తిగత సంరక్షణ కోసం సెక్యురిటీని ఏర్పాటు చేయటం తెలిసిందే. వీరు సదరు ఎమ్మెల్యేల కదలికల్ని.. వేరే ప్రాంతానికి వెళుతున్నట్లైయితే.. ఆ వివరాల్ని తమ ఉన్నతాధికారులకు తెలియజేయాల్సి ఉంటుంది. ఒకవేళ అలా చేయకుంటే.. వారిపై శాఖాపరమైన చర్యలకు అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేల ప్రయాణాలకు సంబంధించిన వివరాల్ని క్రాస్ చెక్ చేయాలని.. వారికి భద్రతను కల్పిస్తున్న సిబ్బందిని విచారించాలన్న యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే డ్రగ్స్ రాకెట్ కు సంబంధించి నాలుగు కేసులు దాఖలు కావటం.. వాటికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీలు సోమవారం బయటకు వచ్చి సంచలనంగా మారాయి. అదే సమయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల భద్రతా సిబ్బందిని శాఖాపరమైన విచారణ జరిపి వారి వాంగ్మూలాన్ని రికార్డు చేయాలన్న యోచనలో కేసీఆర్ సర్కారు ఉన్నట్లు చెబుతున్నారు.